పాపాన్ని అనుభవిస్తావు: ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్

TV anchor Tejaswini suicide note
Highlights

ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు 14వ తేదీ ఉదయం భర్తకు ఫోన్ లో మెసేజ్ పెట్టింది.

విజయవాడ: ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు 14వ తేదీ ఉదయం భర్తకు ఫోన్ లో మెసేజ్ పెట్టింది. "నీ వేధింపుల వల్లే చనిపోతున్నానని, నా చావుకు నువ్వే కారణం. ఈ పాపాన్ని అనుభవిస్తావు. ఆ గోవిందుడే సాక్షి" అంటూ మెసేజ్ చేసింది. 

ఆ సమయంలో భర్త పవన్‌కుమార్‌ షిరిడీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. రెవెన్యూ శాఖ ద్వారా తేజస్విని మృతదేహాన్ని పంచనామా చేయించి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 

మృతురాలి మరణ వాంగ్మూలంలో రాత, గతంలో ఉన్న చేతి రాతను పరిశీలించామని, నిపుణులకు కూడా పంపుతున్నామని చెప్పారు. ఈడుపుగల్లు వచ్చి కొద్ది నెలలే అయ్యిందని, రాజకీయంగా ఓ ఎమ్మెల్యేతో సంబంధాలంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

loader