టీవీ యాంకర్‌ తేజస్విని ఆత్మహత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి.

విజయవాడ: టీవీ యాంకర్‌ తేజస్విని ఆత్మహత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె రాసిన సూసైడ్ నోట్ లో ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. ఆమెది ఆత్మహత్యే అని విజయవాడ ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ విజయభాస్కర్‌ తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన తేజస్విని, మట్టపల్లి పవన్‌కుమార్‌ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ అంకురించి 2014లో వివాహం చేసుకున్నారన్నారు. వివాహం అనంతరం దుబాయ్‌లోనూ, భీమవరంలోనూ నివాసం ఉన్నారు. 

తేజస్విని ఓ టీవీ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసిందని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌లోని అద్దె ఇంట్లోకి మారారు. భర్త వేధింపుల వల్ల, భర్త అక్రమ సంబంధాల వల్ల, తనపై భర్త అనుమానాల వల్ల మనస్తాపానికి గురై ఈనెల 16వ తేదీ రాత్రి అద్దె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని తేజిస్విని ఆత్మహత్య చేసుకుంది. 

ఘటనా స్థలంలో లభించిన మరణ వాంగ్మూలం, సెల్‌ ఫోన్‌ల ద్వారా పంపిన మెసేజ్‌లను నిర్ధారణగా చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతి కేసును 306, 498ఎ సెక్షన్‌ల కింద కేసును మార్పు చేశారు. భర్త పవన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలావుండగా, టీవీ యాంకర్‌ తేజస్విని అనుమానాస్పద స్థితిలో కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 16వ తేదీన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయం 17వ తేదీ వరకు ఈ విషయం వెలుగు చూడలేదు.