Asianet News TeluguAsianet News Telugu

హీరో అని పేరు ఉంటే అరెస్టు చేస్తారు

  •      హీరో అని రాసి ఉన్న టీషర్టులు ధరించిన కొంత మందిని అరెస్ట్ చేసిన టర్కీ ప్రభుత్వం  
turkey police arrested to who wear hero named tea shirts

 


ట‌ర్కీ దేశంలో 2016 సంవ‌త్స‌రంలో రాత్రికి రాత్రే ప్ర‌భుత్వం పై సైనికి దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే, తిరిగి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. వేలాది మంది సైనికులు ట‌ర్కీ అధ్య‌క్షుడు రెసెప్ టయిప్ ఎర్డోగాన్ కు వ్య‌తిరేకంగా ఒక్క రాత్రిలోనే దాడి చేసి ట‌ర్కీని త‌మ ఆధీనంలోకి తెచ్చుకుంది.

ఈ దాడికి ప్ర‌ధాన కార‌ణంగా అమెరికా కు చెందిన మ‌త పెద్ద ఫెతుల్లా గులెన్ అని ట‌ర్కీ ప్ర‌భుత్వం భావిస్తుంది. అక్క‌డి ప్ర‌జ‌లు కూడా కొంద‌రు ఫెతుల్లాకు స‌పోర్టు చేస్తున్నారు. అందుకు ఫెతుల్లాను హీరోగా చిత్రిక‌రిస్తూ ట‌ర్కీ రోడ్ల‌పై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా శ‌నివారం నిర‌స‌నకు దిగారు కొంద‌రు ప్ర‌జ‌లు. త‌క్ష‌ణ‌మే పోలీసు బ‌ల‌గాలు రంగంలోకి దిగి హీరో అని రాసి ఉన్న టీషర్టులు ధరించిన కొంత మందిని టర్కీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.


 
ట‌ర్కీ అధ్య‌క్షుడు రెసెప్ టయిప్ ఎర్డోగాన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 2016 లో దాడి చేసింది వాళ్ల స్వంత‌ సైన్య‌మే, ఆ దాడిలో 400 మంది ప్ర‌జ‌లు చ‌నిపోయ్యారు. 2,100 మంది గాయాల పాల‌య్యారు. ఈ దాడి అధ్య‌క్షుడు విదేశాల‌కు వెళ్లినప్పుడు జ‌రిగింది. అక్క‌డి ప్ర‌భుత్వం ఈ దాడికి కార‌ణం అయిన వారిని వేలాది మంది అరేస్టు చేసింది అందులో 10,000 మంది సైనికులు ఉండ‌గా,30,000 మంది ప్ర‌జ‌లు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios