Asianet News TeluguAsianet News Telugu

రేపటినుండే తుంగభద్ర పుష్కరాలు... నదీ స్నానానికి అనుమతించని ప్రభుత్వం

నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12 రోజుల పాటు పుష్కరాల తుంగభద్ర పుష్కరాలు నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Tungabhadra Pushkaralu... AP Endowment department released notification
Author
Amaravathi, First Published Nov 19, 2020, 11:17 AM IST

అమరావతి: తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దేవాదాయశాఖ జారీ చేసింది. నవంబరు 20 తేదీ మద్యాహ్నం 1.21 నిముషాల నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అవుతాయని ఈ నోటిఫికేషన్ లో పేర్కోన్నారు. 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పేర్కోన్నారు. 

నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12 రోజుల పాటు పుష్కరాల నిర్వహణ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు 11 తేదీన జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో తుంగభద్రా నదీ పుష్కరాల ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వెల్లడించారు.

తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. 

ఇక పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో స్పెషల్ కమీషనర్ అర్జునరావు వీడియో కాన్పరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు.

ఈ పుష్కరాల కారణంగా కోవిడ్ వ్యాప్తిచెందకుండా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ...భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios