అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దోస్తీపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుక ఉన్న కక్ష వల్లనే వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో పొత్తు పెట్టుకుంటున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

అప్పట్లో టీఆర్‌ఎ్‌సను తుడిచిపెట్టేయాలని వైఎస్‌ భావించారని, వైఎస్‌ బతికుంటే టీఆర్‌ఎస్‌ ఉండేది కాదని తులసిరెడ్డి అన్నారు. వైఎస్ పై ఉన్న ఈ ప్రతీకారంతోనే ఇప్పుడు జగన్‌తో కేసీఆర్‌ పొత్తు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

వైసీపీని కేసీఆర్‌ ఈ విధంగా ఫినిష్‌ చేస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకుని జగన్‌ సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.