తిరుమల: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది.  కలెక్టర్ అని చెప్పినా కూడ టీటీడీ విజిలెన్స్ అధికారులు  కలెక్టర్ ను వెనక్కి పంపారు. దీంతో  చేసేది లేక ఆయన వెనక్కి వెళ్లారు.

రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని  తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆలయంలోకి రాష్ట్రపతితో పాటు ఇతరులను ఎవరిని పంపకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. అసాధారణ భద్రత పేరుతో ముఖ్యులను కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు.

also read:తిరుమల బాలాజీని దర్శించుకొన్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు

బయోమెట్రిక్ వద్ద చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకొన్నారు. కలెక్టర్ నని చెప్పినా కూడ ఆయనకు అనుమతిని నిరాకరించారు.

ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారిని కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు వెనక్కి పంపించారు.