Asianet News TeluguAsianet News Telugu

రమణదీక్షితులు ఎఫెక్ట్: శ్రీవారి ఆభరణాలను పరిశీలించిన టీటీడి పాలకవర్గ సభ్యులు

శ్రీవారి ఆభరణాలను పరిశీలించిన టీటీడీ పాలకవర్గ సభ్యులు

TTD trust board members observation of Lord Venkateswara swamy jewellery

తిరుమల: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు  రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆలయంలో శ్రీవారి ఆలయంలో  స్వామి వారి ఆభరణాలను పరిశీలించనున్నారు. ఇటీవల కాలంలో రమణ దీక్షితులు చేసిన ఆరోపణలతో  గందరగోళం చోటు చేసుకొంది. దీంతో భక్తుల్లో విశ్వాసాన్ని కల్పించేందుకుగాను  టీటీడి పాలకవర్గం  ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.  మంగళవారం నాడు  టీటీడీ పాలకవర్గం సమావేశం నిర్వహించింది.

 శ్రీవారి ఆభరణాలను టీటీడి పాలకవర్గ సభ్యులు  పరిశీలించారు. గత సమావేశంలోనే  ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.  ఈ నిర్ణయం మేరకు సోమవారం నాడు   టీటీడీ పాలకవర్గ సభ్యులు  ఇవాళ ఆభరణాలను పరిశీలించారు.

శ్రీవారి ఆభరణాలను భక్తుల పరిశీలన కోసం  ప్రదర్శించాలని కూడ భావించారు. కానీ, పండితుల సూచనల మేరకు  ఈ విషయమై  టీటీడీ  పాలకవర్గం వెనక్కు తగ్గింది.  టీటీడీపై ఇటీవల కాలంలో  మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు గుప్పించారు.

ఈ ఆరోపణలపై టీటీడీ కూడ గతంలో సమాధానం చెప్పింది. అయితే  ఈ ఆరోపణలపై భక్తులపై నెలకొన్న  సందేహలను తొలగించేందుకు గాను  శ్రీవారి ఆభరణాలను టీటీడీ పాలకవర్గ సభ్యులు ఇవాళ పరిశీలించారు. 

భక్తులకు పరిశీలనకు పెట్టాలనే యోచనను ఆగమశాస్త్ర పండితుల సూచనల మేరకు  విరమించుకొన్నారు.ఈ ఆభరణాలను పరిశీలించిన పాలకవర్గ సభ్యులు  సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అపోహలకు తావు లేదని వారు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios