తిరుపతిలో ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ ద్వారా 10 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో (ttd eo) జవహర్ రెడ్డి (jawahar reddy) గురువారం ప్రకటించారు. అలాగే ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళం ఇచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) (tirumala tirupati devasthanam) శుభవార్త చెప్పింది. దేశంలో కోవిడ్ (coronavirus) పరిస్ధితులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సర్వదర్శనం (sarvadarshanam) భక్తుల సంఖ్య పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలో ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ ద్వారా 10 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో (ttd eo) జవహర్ రెడ్డి (jawahar reddy) గురువారం ప్రకటించారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు. ఆర్జిత సేవల పునరుద్ధరణపై పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు జవహర్ రెడ్డి చెప్పారు. ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళం ఇచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఉదయాస్తమాన టికెట్లు బుకింగ్‌కు పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ఈవో చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా కూడా విరాళాలు ఇచ్చి ఉదయాస్తమాన సేవ టికెట్లు పొందవచ్చని జవహర్ రెడ్డి తెలిపారు.
ఇకపోతే.. తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. Vaikuntham Queue Complex ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్యనాయుడికి మహాద్వారం వద్ద తితిదే ఈవో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శించుకోవాలన్న నియమం పెట్టుకోవడం ద్వారా సామాన్య భక్తులు మెరుగైన దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తాను అదే నియమాన్ని పాటిస్తున్నానని, మనవరాలి వివాహంలో పాల్గొనేందుకు తిరుమల వచ్చి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మరోసారి దర్శించుకోవాలన్న భావన ఉంటుందని అన్నారు. హిందూ ధర్మపరిరక్షణ, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాలని కోరారు.
