Asianet News TeluguAsianet News Telugu

సగం ధరకే తిరుపతి లడ్డు: 25 నుండి ఏపీలోని అన్ని జిల్లాల్లో విక్రయాలు

ఈ నెల 25వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో  లడ్డులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో  విక్రయించనున్నారు.
 

TTD TO COMMENCE LADDU PRASADAM SALES FROM MAY 25 ACROSS ALL DISTRICT HQ IN AP
Author
Tirupati, First Published May 22, 2020, 4:23 PM IST

అమరావతి: ఈ నెల 25వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో  లడ్డులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో  విక్రయించనున్నారు.

భక్తులకు సగం ధరకే ఈ లడ్డులను విక్రయించనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఒక్క లడ్డును రూ. 25కు విక్రయిస్తారు. కృష్ణఆ జిల్లాలోని విజయవాడ టీటీడీ కళ్యాణ మండపంలో లడ్డుల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

175 గ్రాముల శ్రీవారి లడ్డు వాస్తవ ధర రూ. 50 లు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ లడ్డులను సగం ధరకే విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. వెయ్యికి పైగా లడ్డులు అవసరమైన వారు తమకు మెయిల్ చేయాలని టీటీడీ కోరింది. భక్తుల అవసరాలతో పాటు మొబైల్ నెంబర్ తో సహా ఐదు రోజులకు ముందు tmlbulkladdus@gmail.comకు మెయిల్ చేయాలని కోరారు.

also read:పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

తిరుపతి లడ్డు కౌంటర్లలో ఉన్న లడ్డులతో పాటు ఆయా జిల్లాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల వద్ద ఉన్న లడ్డుల నిల్వలను బట్టి వెయ్యికి పైగా లడ్డుల లభ్యతపై భక్తులకు సమాచారం ఇవ్వనున్నట్టుగా టీటీడీ తెలిపింది. ఏ రకంగా ఏ సమయంలో ఎక్కడ నుండి లడ్డులను పొందుతారో భక్తులకు మెయిల్ ద్వారా టీటీడీ సమాచారం ఇవ్వనుంది.

చెన్నై, బెంగుళూరు, హైద్రాబాద్ లలో కూడ శ్రీవారి లడ్డులను భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. అయితే ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొన్న తర్వాత ఈ మూడు ప్రాంతాల్లో లడ్డుల విక్రయం ప్రారంభించనున్నట్టుగా టీటీడీ తెలిపింది.

మరింత సమాచారం కోసం టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని టీటీడీ కోరింది. 18004254141 లేదా 1800425333333  టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios