చిల్లర లేక అల్లాడిపోతున్న భక్తులను అదుకునేందుకు టిటిడి ముందుకు రాకపోవడం పట్ల భక్తుల నిరసన

భక్తులుఇచ్చే ముడుపు తీసుకోవడమే కాని,చిల్లర కష్టాలలలో ఉన్నభక్తులను ఆదుకునేందుకు టిటిడి ముందుకు రాకపోవడం పట్ల తిరుమల కొచ్చి చిల్లర లేక బాధపడుతున భక్తులు విచారం వ్యక్తం చేశారు.

 పరకామణి లో వస్తున్న చిల్లరను భక్తులకు అందుబాటులోకి తెస్తే తిరుపతికి వచ్చి చిన్న నోట్లు, చిల్లర లేక ఇబ్బందులు పడ్తున్న వేలాది మంది భక్తులకు ఉపశమనం కలుతుతుందని వారు చెప్పారు. ఒక భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు భక్తులు ఈ మేరకు తిరుపతి అలిపిరి వద్ద ఒక ప్రదర్శన జరిపారు.

ప్రధాని నరేంద్రమోడీ రోడ్లు రద్దును ప్రకటించిన తర్వాత వేలాది మంది అకస్మాత్తుగా తమ దగ్గిర ఉన్న పెద్ద నోట్లచెల్లక పోవడంతో నానా ఆగచాట్లు పడ్డారు. వాళ్లంత తిండికి లేక తిరుపతిలో ఇబ్బంది పడటం, షాపుల దగ్గిర చిల్లర కోసం బతిమాలడం తాము చూశామని చెబుతూ ఇలాంటి భక్తులను ఆదుకోవాలనే ఆలోచన తిరుమల తిరుపతి దేవ స్థానం అధికారులకు లేకపోవడం విచారకరమని ఈ భక్తులు వ్యాఖ్యానించారు.

’శ్రీవారి పరాకామణి కి రోజూ లక్షలాది రుపాయల చిల్లర వస్తుంది. ఈ డబ్బును భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు టిటిడి చిల్లర మార్పడి కౌంటర్లను తెరవాల్సి ఉండింది. పదకొండ రోజుల తర్వాతకూడా టిటిడి ఈ చర్య తీసుకొనకపోవడం దురదృష్టం,’ అని నవీన్ అన్నారు.

 వి ఐపి లసేవల కోసం అనేక ఏర్పాట్లు చేసే టిటిడి అధికారులు సాధారణ భక్తులకు సేవలందించేందుకు రాకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు.ఈ చిల్లరను టిటిడి ఏమి చేసుకుంటుంది. దీనిని భక్తులకు మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

 ఇదే విధంగా నల్లధన మహారాజులకు కూడా వారు విజ్ఞప్తి చేశారు. ’ 50-50, 70-30 కమిషన్ల పేరుతో నల్లధనాన్ని వృధా చేయవద్దు. మీ నల్ల ధనాన్ని శ్రీవారికి అందిస్తే అన్న దానం వంటి కార్యక్రమాలు నిరాఘాటంగా సాగే వీలుంటుందని వారు చెప్పారు.ఈ నల్లధనం కోసం అలిపిరి వద్ద పెద్ద హుండిలను ఏర్పాటు చేయాలని వారు టిటిడికి సూచించారు.

నగదు సమస్య ఉన్నందున దేశమంతా టోల్ రద్దు చేసినా అలిపిరి వద్ద టిటిడి టోల్ వసూలు చేయడం పట్ల కూడా వారు నిరసన తెలిపారు. వెంటనే అలిపిరి టోల్ గేట్ ను మూసివేయాలని కూడా వారు కోరారు.