Asianet News TeluguAsianet News Telugu

స్వామివారి పరువు వందకోట్లేనా: టిటిడిపై రమణ దీక్షితులు

టిటిడిపై  మరోసారి హట్ కామెంట్స్

TTD should answer my questions says former TTD chief priest Ramana dheekshitulu


హైదరాబాద్:తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే టిటిడి తనపై పరువు నష్టం దావా వేసిందని టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు. తనపై వంద కోట్ల పరువు నష్టం దావాను టిటిడి వేసిందని ఆయన చెప్పారు.

హైద్రాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో  బుధవారం నాడు  రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలకు సమాధనం చెప్పిన తర్వాత పరువు నష్టం దావా వేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామివారి పరువు వంద కోట్లు మాత్రమేనా అని ఆయన ప్రశ్నించారు.


తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారికి  మలినమైన ప్రసాదాలను నైవేద్యంగా ప్రసాదంగా  పెడుతున్నారని రమణదీక్షితులు ఆరోపించారు.  ఈ విషయమై తాను  ప్రశ్నిస్తే  తనను ఉద్యోగం నుండి  తొలగించారని ఆయన చెప్పారు. 


అంతేకాదు  తనపై వంద కోట్ల పరువు నష్టం దావా వేశారని ఆయన చెప్పారు.  ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.తిరు ఆభరణాల లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  తనను ఉద్యోగం నుండి  తొలగించే అధికారం  టిటిడికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

స్వామివారి గర్భాలయంలోకి అర్చకులకు మినహా భక్తులకు ప్రవేశం ఉండదని ఆయన చెప్పారు. కలియుగంలో దైవభయం, భక్తి లేకుండా పోయాయని ఆయన చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios