జగన్‌ ను కలిస్తే తప్పేంటి, బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: రమణ దీక్షితులు

First Published 7, Jun 2018, 5:16 PM IST
TTD priest Ramana dheeksheetulu  meets Ys Jagan
Highlights

రమణ దీక్షితులు నెక్స్ట్ స్టెప్ ఏమిటి

హైదరాబాద్:టిటిడిలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులు హైద్రాబాద్ లోటస్
పాండ్ లో వైసీపీ వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. టిటిడి పాలకవర్గంపై తీవ్ర విమర్శలు
చేసిన రమణ దీక్షితులు గురువారం నాడు జగన్ తో సమావేశం కావడం రాజకీయంగా
ప్రాధాన్యత సంతరించుకొంది.

20 నిమిషాల పాటు వైసీపీ చీప్ వైఎస్ జగన్ తో  సమావేశమయ్యారు.  తనకు న్యాయం
జరుగుతోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మిరాసీ వ్యవస్థను కాపాడాల్సిన
బాధ్యత నాదేనని రమణ దీక్షితులు చెప్పారు.

నా పొట్ట ఎవరు నింపితే  వారికి నమస్కారం పెడతానని ఆయన చెప్పారు. నా మీద ఎవరు
విచారణ చేసినా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.  సీఎం చంద్రబాబునాయుడు
తనకు అపాయింట్ మెంట్ దక్కలేదన్నారు.

తాను చేసినా ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. స్వామి వారి నగల కోసం
తాను ఇంతకాలం పాటు పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు.   తనకు న్యాయం
చేస్తానని  వైఎస్ జగన్ హమీ ఇచ్చారని  రమణ దీక్షితులు చెప్పారు. చట్టపరంగా
కల్పించాల్సిన సౌకర్యాలు ఎత్తివేసిందన్నారు. 

సీఎం మా వంశపారంపర్యకష్టాలను తీర్చితే చంద్రబాబునాయుడు ఫోటోను ఇంట్లో
పెట్టుకొని పూజలు చేస్తానని ఆయన చెప్పారు. 
 

 

 

టిటిడిపై  విమర్శలు గుప్పిస్తూ రమణదీక్షితులు ఇటీవల కాలంలో మీడియాలో ప్రధానంగా
నిలిచారు. అయితే రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టిటిడి కూడ అదే స్థాయిలో
సమాధానం ఇచ్చింది. టిటిడిలో పింక్ వజ్రం కన్పించకుండా పోయిందని రమణదీక్షితులు
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు కూడ ఫిర్యాదు చేశారు. బిజెపి జాతీయ
అధ్యక్షుడు అమిత్ షా తో కూడ సమావేశమయ్యారు.


టిడిపి నేతలు రమణదీక్షితులుపై కూడ విమర్శలు చేశారు. టిటిడి రమణదీక్షితులు చేసిన
ఆరోపణలపై న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.ఈ తరుణంలో
లోటస్‌పాండ్ లో  జగన్ తో రమణదీక్షితులు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత
సంతరించుకొంది.
 

loader