విదేశీ విరాళాలపై టీటీడీకి ఊరట: కేంద్రం నుండి లేఖ
గుర్తు తెలియని వ్యక్తుల నుండి విదేశీ విరాళాలను స్వీకరించినందుకు గాను టీటీడీకి కేంద్రం రూ. 3 కోట్లు జరిమానాను విధించింది. అయితే ఈ విషయమై టీటీడీ వినతి మేరకు కేంద్రం వెసులుబాటును కల్పించింది
తిరుమల: తిరుమల: గుర్తు తెలియని విదేశీ విరాళాలు స్వీకరించిన విషయంలో టీటీడీకి కేంద్రం ప్రభుత్వం నుండి ఊరట లభించింది. ఈ విషయంలో ఐదేళ్ల పాటు వెసులుబాటును కల్పిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి సమాచారం అందింది. హుండీలో గుర్తు తెలియని విదేశీ విరాళాలను స్వీకరించినందుకు గాను టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి రూ. 3 కోట్లు జరిమానాను చెల్లించింది. విదేశీ విరాళాల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టీటీడీ కేంద్రానికి జరిమానాను చెల్లించింది.
హుండీలో కి వచ్చిన విదేశీ విరాళాలకు సంబంధించి వివరాలను ఇవ్వాలని కేంద్రం టీటీడీని కోరింది. అయితే ఈ వివరాలు లేవని టీటీడీ కేంద్రానికి తెలిపింది. కేంద్రం ఆదేశాల మేరకు టీటీడీ రూ.3 కోట్లను జరిమానా కింద విధించింది.
విదేశీ విరాళాలను టీటీడీ వినియోగించుకోవడంపై కూడ అభ్యంతరం తెలిపిందని సమాచారం. విదేశీ వివరాళాల ద్వారా ఆర్జించిన వడ్డీని ఉపయోగించడంపై కూడ కేంద్రం అభ్యంతరాలు తెలిపిందని సమాచారం.
దాదాపుగా మూడేళ్లుగా టీటీడీ వద్ద ఉన్న రూ.26.36 కోట్ల విదేశీ కరెన్సీ లావాదేవీలపై కేంద్రం స్ధంభింపజేసింది. అంతేకాదు రూ. 3 కోట్లు జరిమానా విధించింది. అంతేకాదు టీటీడీ దాఖలు చేసిన వార్షిక రిటర్న్ లు కూడా తప్పుడు ఫార్మెట్ లో ఉన్నాయని టీటీడీ కి కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎస్‌బీఐలోని ప్రత్యేక ఖాతాల్లో టీటీడీ విదేశీ నిధులను జమ చేయాలి. ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరద్దరణ ఇంకా జరగలేదు. 2019 చివరిలో ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ ముగిసింది.
గతంలో టీటీడీ 1.14 కోట్లను జరిమానాను చెల్లించిన విషయం తెలిసిందే. టీటీడీ లాభాపేక్ష లేని హిందూ మత సంస్థగా పరిగణించాలని టీటీడీ కోరుతుంది. ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ను పునరుద్దరించాలని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు. టీటీడీ వినతి మేురకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.