భూముల విక్రయాన్ని నిలిపివేయండి: టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి బోర్డు సభ్యుడు రాకేష్ సిన్హా లేఖ
తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీకి చెందిన భూముల విక్రయించాలని తీసుకొన్న నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని టీటీడీ సభ్యుడు, ఎంపీ, రాకేష్ సిన్హా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు.
తిరుపతి: తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీకి చెందిన భూముల విక్రయించాలని తీసుకొన్న నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని టీటీడీ సభ్యుడు, ఎంపీ, రాకేష్ సిన్హా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు.
తమిళనాడు రాష్ట్రంలో టీటీడీకి చెందిన 23 స్థలాలను విక్రయించాలని బోర్డు తీసుకొన్న నిర్ణయంపై ఆయన లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని ట్విట్టర్ లో పోస్టు చేశారు. 2016లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు ఈ స్థలాలను విక్రయించాలని నిర్ణయం తీసుకొంటే ఆ నిర్ణయాన్ని ఈ బోర్డు రద్దు చేయాలని ఆయన కోరారు.
also read:సగం ధరకే తిరుపతి లడ్డు: 25 నుండి ఏపీలోని అన్ని జిల్లాల్లో విక్రయాలు
టీటీడీ భూముల విక్రయం అనేది భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశమని ఆయన గుర్తు చేశారు.భూముల విక్రయాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు.టీటీడీకి చెందిన నిరర్ధక ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకొన్నామని బోర్డు చేస్తున్న వాదన అర్ధరహితమని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడు రాష్ట్రంలో భూముల విక్రయంపై పాలకమండలిలో చర్చించాలని ఆయన కోరారు.
also read:టీటీడీ ఆస్తుల విక్రయం: 26న ఆందోళనలకు బీజేపీ పిలుపు
తమిళనాడు రాష్ట్రంలోని టీటీడీకి చెందిన నిరర్ధక ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. తమిళనాడులోని 23 చోట్ల ఉన్న ఆస్తుల విలువ రూ. 1.54 కోట్లుగా ఉంటుందని అంచనా.ఈ ఆస్తుల విక్రయం కోసం టీటీడీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆస్తుల విక్రయం కార్యక్రమాలను పర్యవేక్షించనుంది.
టీటీడీ ఆస్తుల విక్రయం విషయమై టీటీడీతో పాటు వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.