Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు విధానాలనే అనుసరిస్తున్నారు. బాంబేసిన రమణదీక్షితులు

తిరుమలలో 15 మంది అర్చకులకు కరోనా సోకడంతో దర్శనాలు నిలిపివేయాలని చెప్పినా కూడ అధికారులు పట్టించుకోవడం లేదంటూ  టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు  ఫిర్యాదు చేశారు

TTD honorary priest Ramana Dheekshitulu sensational comments on Excutive officer
Author
Tiruppur, First Published Jul 16, 2020, 2:32 PM IST


తిరుమల: తిరుమలలో 15 మంది అర్చకులకు కరోనా సోకడంతో దర్శనాలు నిలిపివేయాలని చెప్పినా కూడ అధికారులు పట్టించుకోవడం లేదంటూ  టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం నాడు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ఫిర్యాదు చేశాడు.25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉందని ఆయన చెప్పారు.

TTD honorary priest Ramana Dheekshitulu sensational comments on Excutive officer

తిరుమలలో ఇప్పటివరకు 15 మంది అర్చకులకు కరోనా సోకింది. గురువారం నాడు మధ్యాహ్నం మరో ముగ్గురు అర్చకులకు కరోనా సోకింది. దీంతో మొత్తం 18 మంది అర్చకులకు కరోనా సోకినట్టుగా తేలింది.

అర్చకులకు కరోనా సోకడంతో  భక్తులకు దర్శనాలు నిలిపివేయాలని కోరినా కూడ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.  ఈ విషయమై ఈవో, ఏఈఓలకు చెప్పినా కూడ పట్టించుకోవడం లేదంటూ ఆయన  ఫిర్యాదు చేశారు.

also read:తిరుమలలో15 మంది అర్చకులకు కరోనా: అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

కేసులు పెరుగుతున్న ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందన్నారు.ఇదే రకంగా వ్యవహారిస్తే ముందు ముందు పరిస్థితి చేయి దాటి పోయే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వంశపరంపర్య అర్చకులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో చంద్రబాబు నాయుడు పాలసీని అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios