Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారి భక్తులకు శుభవార్త: సర్వదర్శనం, రూ.300 టోకెన్ల జారీ సంఖ్య పెంపు.. ఎప్పటి నుంచి అంటే..?

తిరుమల (thirumala) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ (ttd). కరోనా తగ్గుముఖం (coronavirus) పట్టడంతో శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకెన్లు  జారీ చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.

ttd hikes offline free darshan tokens
Author
tirumala, First Published Feb 22, 2022, 2:45 PM IST | Last Updated Feb 22, 2022, 2:45 PM IST

తిరుమల (thirumala) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ (ttd). కరోనా తగ్గుముఖం (coronavirus) పట్టడంతో శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకెన్లు  జారీ చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25 వేలకు పెంచినట్లు తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31 వరకు సంబంధించిన కాలానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. 

ఇక గత గురువారం జరిగిన సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. .. ప్రధానంగా 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ. 3వేల 171 కోట్ల అంచనాగా బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఇక, సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం రూ. 2 వేలు, తోమాల, అర్చన రూ. 5 వేలు, కల్యాణోత్సవం రూ. 2,500, వేద ఆశీర్వచనం రూ. 10 వేలుగా నిర్ణయించింది. వస్త్రాలంకరణ సేవా టికెట్ ధర రూ. లక్షకు పెంచింది. 

ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అన్నమయ్య నడకమార్గాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణం చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సైన్స్ సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో అదే స్థలంలో ఆధ్యాత్మిక నగరాన్ని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చూస్తుంది. 

టీడీడీ తీసుకన్న మరిన్ని నిర్ణయాలు..
-రూ. 230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 
-రూ. 2.7 కోట్లతో స్విమ్స్ హాస్పిటల్ పూర్తిగా కంప్యూటీకరణ
-ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ. 25 కోట్ల కేటాయింపు 
-తిరుమలలో అన్నప్రసాదాన్ని మరిన్ని ప్రదేశాలలో అందించేందుకు నిర్ణయం 
-నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రతిపాదిక నిర్మాణం
-రూ. 3.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ది 

త్వరలోనే పూర్తి స్థాయిలో సర్వదర్శనాలు..
తిరుమలలో ప్రైవేట్ హోటళ్లను పూర్తిగా తొలగించనున్నట్టుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) తెలిపారు. తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందజేస్తామని చెప్పారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికి ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో సర్వదర్శనాలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. కేంద్రం అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios