Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం: టీటీడీ గ్రీన్ సిగ్నల్

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఉచితంగా భక్తులు దర్శించుకోవడానికి ఈ నెల 29వ  తేదీ నుండి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 3 వేల మంది భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 

ttd greensingnals to sarvadarshan from august 29, 2020
Author
Tirupati, First Published Aug 28, 2020, 3:41 PM IST

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఉచితంగా భక్తులు దర్శించుకోవడానికి ఈ నెల 29వ  తేదీ నుండి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 3 వేల మంది భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 

also read:తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుపతిలో కరోనా కేసులు భారీగా పెరగడంతో శ్రీవెంకటేశ్వరస్వామి సర్వదర్శనం కోసం జారీ చేసే టోకెన్లను ఈ ఏడాది జూలై 21వ తేదీ నుండి నిలిపివేశారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి ప్రతి రోజూ 12 వేల మందికి స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. 9 వేల మందికి ఆన్ లైన్ లో మిగిలిన 3 వేల మందికి ఉచితంగా దర్శనం కల్పిస్తారు. అయితే ఆఫ్ లైన్ దర్శనాలు( సర్వదర్శనం) నిలిపివేశారు. మొత్తం దర్శనాల కోసం ఆన్ లైన్ లో టిక్కెట్ల కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

also read:ఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకులో నగదు, బంగారం డిపాజిట్: టీటీడీ కీలక నిర్ణయాలు..

తిరుపతిలో కఠినమైన లాక్ డౌన్ నిబంధనలు విధించడంతో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఈ తరుణంలో ఈ నెల 29వ తేదీ నుండి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.ప్రతి రోజూ ఆన్ లైన్ ద్వారా 9వేల టిక్కెట్లను జారీ చేయనున్నారు. మిగిలిన 3 వేల టోకెన్లను ఆఫ్ లైన్లో ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో 12 వేలకు మించి భక్తులకు దర్శనాలు కల్పించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios