రికార్డు బ్రేక్: ఒక్క రోజులోనే టీటీడీకి రూ. 6.18 ఆదాయం

తిరుమల శ్రీ  వెంకటేశ్వరస్వామికి ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఒక్క రోజులోనే రూ. 6.18 కోట్ల ఆదాయం వచ్చింది. 2012లో వచ్చిన రికార్డు ఆదాయాన్ని రెండు రోజుల క్రితం వచ్చిన ఆదాయం బద్దలు కొట్టింది. ఇప్పటివరకు రూ. 5.73 కోట్ల ఆదాయమే రికార్డు. అయితే ఈ నెల 3న తిరుమలకు రూ. 6.18 కోట్ల ఆదాయం వచ్చింది.

TTD Gets Record Revenue Rs.6.18 Crore In Single day

తిరుమల: TTD కీ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో Income వచ్చింది. ఇప్పటివరకు రికార్డు స్థాయి ఆదాయంరూ. 5.73 కోట్లు. అయితే ఈ రికార్డును టీటీడీ బ్రేక్ చేసింది. ఈ ఏడాది జూలై 3న Tirumala తిరుపతి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఒక్క రోజులోనే రూ. 6.18 లక్షల ఆదాయం వచ్చింది. ఒక్క  రోజులోనే రూ. 6 కోట్ల ఆదాయం దాటడం టీటీడీ చరిత్రలో ఇదే ప్రథమం.

కరోనా తర్వాత టీటీడీకి క్రమంగా ఆదాయం పెరుగుతూ వస్తోంది. Corona  తర్వాత శ్రీవారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో ఆదాయం కూడా పెరుగతుంది. ప్రతి నెల టీటీడీ ఆదాయం రూ. 100 కోట్లు దాటుతుంది. కరోనా కారనంగా టీటీడీ కొంత ఇబ్బంది పడింది. కరోనా తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి పరిమితంగా అనుమతిని ఇచ్చింది. ఆ తర్వాత క్రమంగా Devotees సంఖ్యను పెంచింది. ప్రస్తుతం భక్తుల రాకపై ఎలాంటి ఆంక్షలు లేవు. 

వేసవి సెలవుల సమయంలో తిరుమలకు పెద్దఎత్తున భక్తులు Balaji ని దర్శించుకున్నారు. మే మాసంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆ మాసంలో టీటీడీ ఆలయం రాబడి కూడా పెరిగింది. మే మాసంలో రూ. 130 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

also read:సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కరోనా తర్వాత తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుమల హుండీ ఆదాయం రూ.79.34 కోట్లు వచ్చింది. మార్చి మాసంలో టీటీడీ ఆదాయం పెరిగింది.  మార్చిలో టీటీడీ ఆదాయం రూ.128.60 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్ మాసంలో టీటీడీ ఆదాయం కొంచెం తగ్తింది. మార్చి మాసంలో వచ్చిన ఆదాయం కంటే ఏప్రిల్ మాసంలో తగ్గింది. ఏప్రిల్ మాసంలో రూ. 127 కోట్లుగా నమాదైంది. అయితే మే మాసంలో మాత్రం టీటీడీ ఆదాయం ఏకంగా రూ. 130 కోట్లుగా నమోదైంది.

ఆదివారం నాడు టీటీడీకి రూ.6.18 కోట్ల రెవిన్యూ వచ్చింది. అయితే ఓ భక్తుడు ఒక్కడే రూ.1.19 కోట్లను టీటీడీకీ అందించాడు. ప్రతి ఏటా ఈ భక్తుడు కోటికిపైగా స్వామివారికి విరాళంగా ఇస్తున్నట్టుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ భక్తుడి వివరాలు కూడా తమకు తెలియవని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios