లాక్‌డౌన్ ఎఫెక్ట్: మే 3 వరకు తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేత
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నాడు నిర్ణయం తీసుకొంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడ మే 3వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.
తిరుపతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నాడు నిర్ణయం తీసుకొంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడ మే 3వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు టీటీడీ కూడ ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు.మార్చి 19వ తేదీ రాత్రి వరకు ఆలయం వద్ద ఉన్న వారికి దర్శనం చేయించిన తర్వాత కొత్త వారికి పాసులను నిలిపివేసింది టీటీడీ.
అయితే స్వామివారికి ఏకాంత సేవలను కొనసాగిస్తున్నారు అర్చకులు. లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీకి పొడిగిస్తున్నట్టుగా మంగళవారం నాడు ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో మే 3వ తేదీ వరకు తిరుమల శ్రీవారిని భక్తులను దర్శనం కోసం అనుమతి ఇవ్వడం లేదని టీటీడీ ప్రకటించింది.
also read:లాక్‌డౌన్ పొడిగింపును సమర్ధిస్తున్నా: చంద్రబాబు
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఇది రెండోసారి. 1892లో రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ సారే ఆలయాన్ని మూసివేశారు.
గ్రహణాలు ఏర్పడిన సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత తిరిగి ఆలయాన్ని తెరిచేవారు.కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 23 నుండి శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం లేకుండా పోయింది.