తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎల్ 1,ఎల్2,ఎల్ 3,బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇకపై ప్రోటోకాల్, సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలే ఉంటాయని క్లారిటీ ఇచ్చేశారు.  దర్శనాల రద్దు అంశంపై ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. 

ఇవాళ్లి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2012కు ముందు శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉండేవో అలాంటి నిబంధనలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు.  

పూర్వం ఉన్న అర్చనాంతర దర్శనం విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు అంశాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ కు వసతి గృహం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరోవైపు భక్తులు సౌకర్యార్ధమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ప్రతీఒక్కరూ శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సకాలంలో దర్శనం చేయించడమే తమ లక్ష్యమని చెప్పారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇకపై కోర్టులను ఆశ్రయించే పరిస్థితి భవిష్యత్ లో రానియ్యనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.