తిరుమల తిరుపతి దేవస్థానంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండించారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

రూ.2,300 కోట్ల టీటీడీ డబ్బును ట్రెజరీకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. అంతేకాకుండా తప్పుడు ఖాతాలతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సుబ్బారెడ్డి.. టీటీడీకి త్వరలో సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

అది దేవుని సొమ్ముని మన ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అధికారం లేదని దీనిని కేవలం భక్తుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

చివరికి దేవుడిని కూడా సోషల్ మీడియాలోకి లాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపాల్లో ఏసీలు ఏర్పాటు చేస్తామని ఛైర్మన్ వెల్లడించారు.

Also Read:2019లో తిరుపతి వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

టీటీడీకి దేశంలోని ముఖ్య నగరాల్లో కల్యాణ మండపాలు ఉన్నాయని, వీటి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించామని వైవీ తెలిపారు. రుషికొండలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రెండు, మూడు నెలల్లో ఫిర్యాదు చేస్తామని వైవీ స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీవారి రథానికి నిప్పు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశించామని, రథానికి మరమ్మత్తులు చేసి పునరుద్దరణకు చర్యలు తీసుకున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు.