Asianet News TeluguAsianet News Telugu

Tirumala Temple: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి శ్రీవారి మెట్టు మార్గం..

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శ్రీవారి మెట్టు (Srivari Mettu) నడకమార్గం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది.

TTD Chairman YV Subba Reddy Reopened Srivari Mettu footpath
Author
Tirupati, First Published May 5, 2022, 11:10 AM IST | Last Updated May 5, 2022, 11:10 AM IST

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శ్రీవారి మెట్టు (Srivari Mettu) నడకమార్గం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఉదయం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచే ఆ మార్గంలో భక్తలును అనుమతించారు. 

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పూర్వం ఉన్న రాతి బండలతోనే శ్రీవారి మెట్టు మార్గంలో మెట్ల మరమ్మతులు పూర్తిచేశామని చెప్పారు. ఉదయం 6 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టుగా తెలిపారు. ఈ మార్గంలో భక్తులకు నిత్యప్రసాదాలు అందజేస్తామని చెప్పారు. 

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక,  బుధవారం తిరుమల శ్రీవారిని 69,603 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు.

ఇక,  కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులు.. అలిపిరి మార్గంతో పాటు, శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తారు. అలిపిరి మార్గంలో కన్నా.. శ్రీవారి మెట్టు మార్గంలో త్వరగా తిరుమలకు చేరుకోవచ్చు. అయితే శ్రీవారి మెట్టు మార్గం వద్దకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. ఇక,  గతేడాది కురిసి భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు మార్గం పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే అప్పటి నుంచ  భక్తులను అనుమతించకుండా  శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసేసి.. రూ.3.5 కోట్లతో మరమ్మతులు చేపట్టింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios