రమణదీక్షితులు వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
ఏమైనా సలహాలు ఉంటే పాలకమండలి దృష్టికి తీసుకురావాలని టీటీడీ గౌరవ అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
తిరుమల: ఏమైనా సలహాలు ఉంటే పాలకమండలి దృష్టికి తీసుకురావాలని టీటీడీ గౌరవ అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
టీటీడీ ఆలయంలో పనిచేస్తున్న 15 మంది అర్చకులకు కరోనా సోకిందని... ఆలయంలో దర్శనాలను నిలిపివేయకపోతే పెద్ద ఉపద్రవం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు ఆయన ఫిర్యాదు చేశారు.
also read:చంద్రబాబు విధానాలనే అనుసరిస్తున్నారు. బాంబేసిన రమణదీక్షితులు
దీనిపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం నాడు స్పందించారు. బహిరంగంగా విమర్శలు చేయడం సరైందికాదన్నారు. రమణ దీక్షితులతో చర్చించాలని అధికారులను ఆదేశిస్తామన్నారు.
శ్రీవారి దర్శనాలు ప్రారంభించిన తర్వాత 140 మంది టీటీడీ సిబ్బందికి కరోనా సోకిందన్నారు. వీరిలో 70 మంది కరోనా నుండి కోలుకొని విధుల్లో చేరినట్టుగా ఆయన చెప్పారు.
భక్తుల ద్వారా ఎవరికీ కూడ కరోనా సోకలేదన్నారు. ప్రతి రోజూ భక్తుల దర్శనాలను పెంచే ఆలోచన లేదని ఆయన చెప్పారు.