Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి

ఈ ఏడాది కూడ ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏకాంతంగానే ఈ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

TTD chairman YV Subba Reddy clarifies on Tirumala Brahmotsavam
Author
Tirupati, First Published Sep 17, 2021, 2:55 PM IST

తిరుపతి:  కరోనా థర్ఢ్‌వేవ్  వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో  ఈ ఏడాది కూడా ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టుగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.కేంద్రం మరోసారి కరోనా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చైర్మన్‌​ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

కొన్నిసాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ ఆలస్యమైందని అన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించి భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.గత ఏడాది కూడ కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ ఏడాది అక్టోబర్ మాసంలో కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో  ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.


 


 

Follow Us:
Download App:
  • android
  • ios