Asianet News TeluguAsianet News Telugu

సమృద్దిగా వర్షాలు కురిసేందుకు వరుణ యాగం.. ఈరోజే అంకుర్పారణ: టీటీడీ చైర్మన్ భూమన

సమృద్దిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గత  నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని అన్నారు.

ttd chairman bhumana karunakar reddy says start varuna yagam today for sufficient rains ksm
Author
First Published Sep 8, 2023, 2:11 PM IST

తిరుమల: సమృద్దిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గత  నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా ఆచార్య రుత్విక్‌ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. 

గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని చెప్పారు. రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. అలిపిరి నడక దారిన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభినట్టే, త్వరలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు చేతి కర్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios