బ్యాంకులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపరాఫర్ ప్రకటించింది. పరకాణి నుంచి చిల్లర నాణేలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీటీడీ.. చిల్లర నాణేలను డిపాజిట్ చేసుకున్న బ్యాంకులకు అంతే మొత్తంటో డిపాజిట్ చేస్తామని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ప్రకటించారు.

దీంతో చిల్లర నాణేల సేకరణకు పలు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. కొన్నేళ్లుగా చిల్లర నాణేల సేకరణకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

ధర్మారెడ్డి నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంక్  మాత్రమే టీటీడీ చిల్లర నాణేలను సేకరిస్తోంది. గణాంకాల ప్రకారం రూ.25 కోట్ల నాణేలు ఆంధ్రా బ్యాంక్ వద్ద వున్నట్లు సమాచారం.