Asianet News TeluguAsianet News Telugu

భయపడించినోళ్లు ఇపుడు భయపడుతున్నారు...

కాలం మారిపోతున్నట్లుంది...

Troubled times for JC brothers of  diwakar travels from Anantapur

కాలం ఎంత మారిపోతున్నదో చూడండి.  తాడిపత్రి సంస్థానాన్ని అయిదారు దశబ్దాలు పరిపాలించి, ప్రత్యర్థి అనేవాడు ఆ భూమిలో తలెగరేయకుండ శాసించినా,  జెసి బ్రదర్స్ ఇపుడు  ఏదో అన్యాయం అంటూ రోడ్డెక్కు తున్నారు.

 

ఇద్దరిలో  పెద్దాయన అనంతపురం ఎంపి,  చిన్నాయన తాడిపత్రి ఎమ్మెల్యే.  వాళ్లుండేది రూలింగ్ పార్టీ. జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రెండో కన్ను...పచ్చ కన్ను. అయినా సరే వాళ్లకి గుర్తింపు రాలేదు. రాష్ట్రం విడిపోవడంతో బాగా దెబ్బతిన్నకుటుంబాలలో జెసి కుటుంబం వొకటి. వాళ్ల మీద దాడి, వాళ్ల హోదా మీద దాడి, వాళ్ల బస్సుల మీద దాడి. వాళ్ల పెత్తనం మీద దాడి. ఇలా అన్నివైపు ల నుంచి దాడులలో వారు చిక్కుకుని ఉన్నారు. సొమ్ముంటేనే చాలదు, సొమ్ముకు సువాసన ఉండాలి. అది పవర్ వల్లే వస్తుంది. వాళ్ల సొత్తు సువాసన కోల్పోతున్నట్లుంది.

 

గతంలో టిడిపి అధికారంలో ఉన్నపుడు ఇలా గే కష్టాలొచ్చాయి. అపుడు పరిటాల కుటుంబం వీరిని వెంటాడింది. కాంగ్రెస్ వీరిని ఆదుకుంది. రాష్ట్రం విడిపోయాక, కాంగ్రెస్ బలహీన పడింది.రక్షణ కోసం టిడిపిలో చేరారు. అయితే, టిడిపి కులం వెంటాడుతూ ఉంది. అనంతపురం కమ్మ మయం అయిందని ఆ మధ్య జెపి దివాకర్ రెడ్డి అనంపురం స్థానిక ఎమ్మెల్యేకి, మేయర్  కు వ్యతిరేకంగా (కమ్మోళ్లు) ధర్నా చేశాడు. 

 

పోనీ సొంతకులస్థులయిన రెడ్లను కాపాడుకున్నాడా.. .లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు రెడ్లను నానామాటలాడాడు.  ఇపుడాయనను రెడ్లు నమ్మరు, కమ్మోళ్లు అసలు నమ్మరు. చంద్రబాబు కూడా కమ్మయే కదా. ఆయనెందుకు నమ్ముతాడు.

 

ఇపుడు తమ్ముడి పరిస్థితి చూడండి. ప్రభాకర్ రెడ్డి సాక్షి పత్రికకు వ్యతిరేకంగా అనంపురం ప్రతిక ఆఫీసు ముందురోడ్డెక్కి ధర్నా చేయాల్సి వచ్చింది. జగన్నుంచి ప్రాణభయం కూడా ఉందని  ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

 

సాధారణంగా రాయలసీమలో పెద్దరెడ్లకు  ఎవరైనా తలనొప్పిగా తయారైనపుడు వాళ్లు స్వయంగా రంగంలోకి దూకడం అనేది జరగదు. అది  డాన్ స్వభావం కాదు. తైనాతీలన పంపించి తాట వొలిపించడమో లేపేయించడమో చేస్తారు. వూరంతా భయ వాతావరణం ఉంటుంది. ఇపుడలా పరిస్థితి లేదు.

 

జిసి బ్రదర్సే భయపడుతున్నట్లుంది.లేకుంటే, ఏమిటీ ధర్నాలు. ఏమిటీ పరాధీనత.

 

రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉండటమే దీనికి కారణం. రాజకీయాలకోసమయిన ప్రతిపక్షం నిజం పక్షాన నిలబడాల్సి వస్తున్నది.

 

ప్రతిపక్షానికి ఇపుడు సోషల్ మీడియా తోడయింది. ఈ రెండు లేకపోతే, ఆంధ్రలో పచ్చ సైనిక పాలన  ఉండేది.

 

కాలం నిజంగా నే మారుతున్నట్లనిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios