రేపటి నుంచి రెండ్రోజుల పాటు వైసీపీ ప్లీనరీ.. పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ఇలా..!!

రేపటి నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో వైసీపీ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై వాహనాలను అనుమతించమని పోలీసులు తెలిపారు. 

traffic restrictions in chennai kolkata highway over ysrcp plenary

రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న వైసీపీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ ప్లీనరీ జరగనుంది. ఈ వేదిక పక్క నుంచి కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి వెళ్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్యనున్న హైవేపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ రహదారిపై వాహనాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

ALso REad:వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి అంతా సిద్దం.. నిర్వహణ కమిటీలు, కన్వీనర్లు వీరే..

చెన్నై నుంచి విశాఖ, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. గుంటూరు నుంచి విశాఖ, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలను తెనాలి, కొల్లూరు, పెనుమూడి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ , నూజివీడు, ఇబ్రహీంపట్నం మీదుగా జాతీయ రహదారిపైకి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వాహనాలను ఇదే మార్గం గుండా మళ్లిస్తారు. 

మరోవైపు ప్లీనరీకి హాజరయ్యే వారి కోసం అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు కాజ టోల్ ప్లాజా సమీపంలో వున్న రామకృష్ణ వెనూజియాలో, నాగార్జున యూనివర్సిటీలోనూ ఏర్పాట్లు చేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు నంబూరు, కంతెరు రోడ్డు, కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్‌మెంట్స్ వద్ద ఏర్పాట్లు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios