Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి: 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్


శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి.   సున్నిపెంట నుండి దోమలపెంట వరకు ఆదివారం నాడు ట్రాఫిక్ జామ్ అయింది. 

Traffic jam at Srisailam project lns
Author
Srisailam, First Published Aug 1, 2021, 4:56 PM IST

కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్టు  వద్ద ఆదివారం నాడు ట్రాఫిక్ జామ్ అయింది.  సున్నిపెంట నుండి  దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 5 కి.మీ ట్రాపిక్  జామ్ కావడంతో  పర్యాటకులు ఇబ్బంది పడ్డారు.శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం చూసేందుకు పర్యాటకులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా  వాహనాలు  నిలిచిపోయాయి. 

ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రికార్డుస్థాయి వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది.  2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి.గత వారంలో ఒక్క రోజులోనే 28 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను రెండు మూడు రోజుల్లో  ఎత్తివేసే అవకాశం ఉంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios