Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రమాణ స్వీకారం... ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

traffic diversions in Andhra Pradesh over YS Jagan sworn ceremony
Author
Hyderabad, First Published May 28, 2019, 4:53 PM IST

ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు 5 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకానున్న గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్వానాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్దం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్‌ కోసం ఏఆర్‌ మైదానం కేటాయించారు. అలాగే అధికారులు, వారి సిబ్బంది, సహాయకుల వాహనాలను బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో నిలపాల్సి ఉంటుంది. 

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి..

విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌, నూజివీడు, విస్సన్నపేట, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.
హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య రాకపోకలు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా సాగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios