ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది. ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఈ చేప చాలా అరుదుగా దొరుకుతుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.  ఈ చేపలలోని పొట్ట బాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని ప్రచారంలో ఉంది.

దీంతో ఈ చేపలను తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఈ చేపలు చిక్కిన మత్స్యకారులకు పండుగే. ఈ చేపలను భారీ ధరలకు విక్రయిస్తారుగోదావరిలో పులుస చేపల మాదిరిగా ఈ తరహా చేపలకు కూడ భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా ఈ తరహా చేపలు తమ వలకు చిక్కాలని వారు కోరుకొంటారు.

వాడరేపుకు చెందిన మత్స్యకారులకు ఈ నెల 22వ తేదీన 28 కిలోల కచ్చిడి చేప చిక్కింది.  ఈ చేపను మత్స్యకారులు విక్రయించారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు చేపను కొనేందుకు పోటీలు పడ్డారు.

దారకొండ అనే వ్యాపారి ఈ చేపను రూ. 1.70 లక్షలకు కొనుగోలు చేశారు.  కచ్చిడి చేపల్లో మగ రకం చేపలకు మరింత డిమాండ్ ఉంటుంది. ఈ చేప కూడ మగ రకం చేప కావడంతో మత్స్యకారుల పంట పండింది. ఈ చేపల కోసం మత్స్యకారులు వేటాడుతుంటారు. ఈ చేపల గురించి తెలిసిన వారెవరూ కూడ వాటిని కొనకుండా వదిలిపెట్టరు.