మహిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్.. భర్త మొహంపై కొట్టడంతో...
మదనపల్లిలో అమానుష ఘటన వెలుగు చూసింది. బ్రష్ చేసుకుంటుండగా భార్య మూతిమీద కొట్టాడో భర్త. దీంతో ఆ భార్య నోట్లోని బ్రష్ గొంతులో ఇరుక్కుపోయింది.
మదనపల్లి : ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళకు బ్రష్ గొంతులో ఇరుక్కుపోయింది. భర్త మూతిమీద కొట్టడంతో ఈ అమానుషం జరిగింది. ఓ మహిళ ఉదయం బ్రష్ చేసుకుంటుండగా భర్త మొహంపై కొట్టాడు. దీంతో బ్రష్ గొంతులో ఇరుక్కుపోయింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఉదయాన్నే గొడవ మొదలయ్యింది. దీంతోనే భర్త భార్యపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.