జనసేనలో సినిమావాళ్ళదే హవా... ఆ నిర్మాత, కొరియోగ్రాఫర్ కు పవన్ కీలక బాధ్యతలు

సినీ హీరోనే అధ్యక్షుడిగా కలిగిన జనసేన పార్టీ అదే స్టైల్లో రాజకీయాలు చేస్తోంది. సినిమాలను ప్రచారం చేసుకోవడంతో ఆరితేరిన ఓ ప్రముఖ నిర్మాతకు జనసేన ప్రచార బాధ్యతలు అప్పగించారు పవన్ కల్యాణ్.  

Tollywood Producer Bunny Vas and choreographer Jani Master in Janasena Party Campaign Committee AKP

అమరావతి : ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి, తిరిగి పవర్ లోకి వచ్చేందుకు టిడిపి-జనసేన కూటమి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే స్వతహాగా సినీనటుడైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారంలో ఆరితేరిన సినిమావాళ్లకే పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. తాజాగా జనసేన పార్టీ ప్రకటించిన   ప్రచార కమిటీలో సినిమావాళ్లకు చోటు దక్కింది. 

తెలుగు ప్రజలకు సినిమాలపై వున్న అభిమానాన్ని ఓట్లుగా మార్చడంలో ఇప్పటివరకు పవన్ కల్యాణ్ విఫలమయ్యారు. కానీ ఈసారి అలా జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు... అందులో భాగంగానే ఇటీవలే పార్టీలో చేరిన సినిమావాళ్లు నిత్యం ప్రజల్లో వుండేలా చూస్తున్నారు. ఇలా సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిన టాలీవుడ్ నిర్మాతకు జనసేన ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించారు పవన్. అలాగే సినీ కొరియోగ్రాఫర్ ఒకరిని ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా నియమించారు. 

Also Read  Pawan Kalyan: దూకుడు పెంచిన జనసేనాని.. ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారు..

సినీ నిర్మాత గవర ఉదయ్ కుమార్ అలియాస్ బన్ని వాస్ జనసేన పార్టీ ప్రచారకమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ప్రముఖ  కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ తో పాటు యాతం నగేష్ బాబు, వబిలిశెట్టి రామకృష్ణ లను వైస్ ఛైర్మన్ లుగా నియమించారు. అలాగే ఉమ్మడి జిల్లాలవారిగా ప్రచార కమిటీ కో-ఆర్ఢినేటర్లను కూడా జనసేన పార్టీ ప్రకటించింది.  

జనసేన ప్రచార కమిటీ :

Tollywood Producer Bunny Vas and choreographer Jani Master in Janasena Party Campaign Committee AKP
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios