Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories: తెలుగునాట పద్మాల పంట.. కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  తెలుగునాట పద్మాల పంట.. కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు, ఎంసెట్ పేరు మార్పు,టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, గ‌ల్లా జయదేవ్ రిటైర్‌మెంట్ , ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. 201 పరుగుల తేడాతో ఘన విజయం, ఇళయరాజా ఇంట విషాదం.. , చరిత్రలో తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు, జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఆనవాళ్లు..వంటి వార్తల సమాహారం. 

Today top stories top 10 Telugu news Andhra Pradesh Telangana headlines krj
Author
First Published Jan 26, 2024, 7:26 AM IST

(Note: పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)

Today's Top Stories: పద్మాలు అందుకున్న తెలుగు తేజాలు వీరే..

Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations)సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2024) ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో పలువురికి పద్మపురస్కారాలు దక్కాయి.  దేశంలోని అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు మన తెలుగువారైన మెగాస్టార్ చిరంజీవి, మాజీ రాష్ట్ర రాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు దక్కింది.  

ఎప్ సెట్ గా ఎంసెట్

TS EAPCET: ఇంజనీరింగ్ , మెడిసిన్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన "EAMCET" పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇప్పటి వరకు టీఎస్ ఎసెంట్‌గా వున్న పేరును ‘‘ TS EAPCET ’’ (తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఎనిమిది ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. వీటిలో ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌ వున్నాయి 

ఎమ్మెల్సీగా కోదండరాం.. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్  నియమించారు  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరామ్,  అమరుల్లాఖాన్ పేర్లను  రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు  సిఫారసు చేసింది.ఈ సిఫారసుకు గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను   గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా  సిఫారసు చేస్తూ అప్పటి భారత రాష్ట్ర సమితి  నేతృత్వంలోని  కేసీఆర్ సర్కార్ గవర్నర్ కు సిఫారసు చేసింది.  అయితే  2023 సెప్టెంబర్  25న  ఈ ఇద్దరి పేర్లను  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.  నిబంధనల మేరకు  వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని  గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.   

టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి  నియామకాన్ని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  గురువారం నాడు ఆమోదించారు.టీఎస్‌సీఎస్‌సీ సభ్యులుగా  పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావు,రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనితా రామచంద్రన్ లను  ప్రభుత్వం నియమించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం  సిఫారసు చేసింది.ఈ విషయమై  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు బుధవారం నాడు  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో  భేటీ అయ్యారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నర్ ను ఆహ్వానించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నూతన చైర్మెన్ గా  మహేందర్ రెడ్డి నియామకానికి సంబంధించి ఆమోదించాలని కోరారు. 

కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీగా దాదాపుగా లైన్ క్లియర్ అయ్యింది. అయితే గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోలేని వారు మళ్లీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిచాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా పోర్టల్ కూడా ప్రారంభించాలని అనుకుంటోంది. మీసేవ ద్వారా అర్హుల నుంచి వెంటనే దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల 29వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అనుకుంటోంది. వీటిని స్వీకరించిన అనంతరం పరిశీలన పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ సప్లయ్స్ కసరత్తులు చేస్తోంది. 

గ‌ల్లా జయదేవ్ రిటైర్‌మెంట్ !

టీడీపీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇకపై రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని గల్లా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి వరుసగా ఎంపీగా గెలిచిన జయ్‌దేవ్ సెకండ్ టర్మ్ తొలినాళ్లలో కొంత యాక్టీవ్‌గానే వ్యవహరించారు. ఎప్పుడైతే జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజాపై గురి పెట్టిందో జయ్‌దేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఆనవాళ్లు..!

Gyanvapi mosque: ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలో ఉన్న జ్ఞానవాపిలో మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదంటూ హిందూ సంస్థల వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఏఎస్ఐ తన నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని, ఆ హిందూ ఆలయాన్ని కూల్చి.. అక్కడ మసీదు నిర్మించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపిలో  ఏఎస్ఐ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను విడుదల చేసింది. కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరు పక్షాలకు  అందించింది.  ఈ క్రమంలో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరుల సమావేశం నిర్వహించి,ఏఎస్‌ఐ నివేదికను ఉటంకిస్తూ అది హిందూ దేవాలయమని పేర్కొన్నారు. 

ఇళయరాజా ఇంట విషాదం.. 

Ilayaraja Daughter Death :ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు, సింగర్ భవతరణి రాజా Bhavatharini Raja ఈరోజు కన్నుమూశారు. ఉన్నట్టుండి ఆమె మరణవార్త తెలియడంతో ఇళయరాజా అభిమానులు చింతిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇక భవతరణి కూడా కోలీవుడ్ లో చాలా సినిమాలకు వర్క్ చేశారు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు 30కి పైగా సినిమాలకు పనిచేశారు. నాలుగేళ్ల కింద వరకూ యాక్టివ్ గానే కనిపించారు. ఈ ఏడాది ప్రారంభంలో తుదిశ్వాస విడిచారు. భవతరణి 47వ ఏటా కన్నుమూశారు. 

ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. 201 పరుగుల తేడాతో ఘన విజయం

icc U 19 cricket world cup 2024: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. దీనిని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ కేవలం 100 పరుగులకు చాప చుట్టేసింది. 

చరిత్రలో తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు

Virat Kohli: విరాట్ కోహ్లి 2023 సంవత్సరానికి ICC పురుషుల వన్డే ‘‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారానికి ఎంపికయ్యారు. వన్డే క్రికెట్‌కు విశేష సేవలందించడంతో పాటు ఆటలో అతని స్థాయిని కోహ్లీ పటిష్టం చేసుకున్నాడు. అవార్డు నేపథ్యంలో విరాట్ కోహ్లీకి క్రికెట్ ప్రముఖులు, సహచరులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ ఇప్పటికే 2012, 2017, 2018లలో ఈ అవార్డును అందుకున్నారు. తద్వారా నాలుగు సార్లు ‘‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’’ను అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. తాజా పురస్కారంతో కలిపి కోహ్లీ ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. గతేడాది భీకర ఫాంలో వున్న కోహ్లీ 24 ఇన్నింగ్సుల్లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. అలాగే వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios