Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమి... ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మరిన్ని వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎక్కువమంది చూసే  దిన పత్రికలు ఈ రోజు తమ మెయిన్ ఎడిషన్స్ ను ఎలాంటివార్తలతో పొందుపరిచాయో సమగ్ర కథనం. 

Today Top stories in Telangana and Andhra Pradesh AKP
Author
First Published Nov 20, 2023, 7:43 AM IST

1. చెదిరిన భారత స్వప్నం... ఆరోసారి ప్రపంచ విజేతగా ఆసిస్ 
 
వందకోట్ల భారతీయుల కలను చెరిపేస్తూ ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 విజేతగా నిలిచిన వార్తను ఈనాడు ప్రధాన వార్తగా ప్రచురించింది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో టీమిండియా అభిమానులను సెలైన్స్ గా వుంచడమే తమ లక్ష్యం అంటూ ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలను గుర్తుచేసారు. అతడు అన్నంత పని చేసాడని... మొదట బౌలింగ్... ఆ తర్వాత బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆసిస్ టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిందని ఈనాడు రాసుకుంటూ వచ్చింది.  ఈ గెలుపుద్వారా ఆస్ట్రేలియా ఖాతాలో ఆరో ప్రపంచకప్ చేరగా టీమిండియా రెండోసారి ఆసిస్ చేతిలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది. ఇలా ప్రపంచ కప్ 2023 ఫైనల్ కు సంబంధించిన వార్తను బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది ఈనాడు. 

2023 వన్డే వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా... అభిమానులకు టీమిండియా మరో‘సారీ’! కెప్టెన్ మారినా కథ మారలేదు...


2. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బ్రతుకులే...: కేసీఆర్ 

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాలమూరు ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ వార్తను ఈనాడు ప్రధాన పేజీలో ప్రచురించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటోందని కేసీఆర్ ప్రస్తావించారు. ఇందిరమ్మ రాజ్యంగా పేదలను కాల్చిచంపారు...మత కల్లోలాలు జరిగాయి... ఆకలి బతుకులు వుండేవి... ఇవన్నీ తెలంగాణలో తిరిగి తెస్తారా అంటూ ఎద్దేవా చేసారు. అసలు ఇదిరా గాంధీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టేవారు కాదని అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది... ఇప్పుడెలా వుందో... ఎంతలా మార్పు జరిగిందో ప్రజలే గమనించాలని కేసీఆర్ సూచించారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే దళారులు, పైరవీకారలు రాజ్యమేలుతారంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రచురించారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే, కాంగ్రెస్ బాగా పాలిస్తే .. ఎన్టీఆర్ టీడీపీ పెట్టేవారా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు


3. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి : జేపి నడ్డా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా చేవెళ్ళ, నారాయణపేట సభల్లో పాల్గొని చేసిన ప్రసంగం ఈనాడులో ప్రధాన వార్తగా వుంది.    బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపి బిజెపిని అధికారంలోకి తీసుకువస్తే  తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని నడ్డా అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిమయంగా మారిందని అన్నారు. ఇక కాంగ్రెస్ బూటకపు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తోందన్నారు. ఇలా బిఆర్ఎస్, కాంగ్రెస్ లపై నడ్డా తీవ్ర విమర్శలు చేసారు. 


4. బిజెపి, బిఆర్ఎస్, మజ్లీస్ ఒక్కటే...: ప్రియాంక గాంధీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొన్న వార్తలు ఈనాడు మొదటి పేజీ వార్తగా ప్రచురించింది. ఖానాపూర్, ఆసిఫాబాద్ సభల్లో పాల్గొన్న ప్రియాంక ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్... అమరవీరుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. బిఆర్ఎస్, బిజెపి, మజ్లీస్ పార్టీలో ఒక్కటే... కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపించాలని ప్రియాంక కోరారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు పోతేతప్ప తెలంగాణ నిరుద్యోగులకు  ఉద్యోగాలు రావంటూ ప్రియాంక ప్రసంగాన్ని ఈనాడు ప్రచురించింది. 

బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం తమ్ముడు .. నాటు నాటు డ్యాన్సులేస్తున్నారు : ప్రియాంకా గాంధీ సెటైర్లు
   

5. జగనన్న పాలవెల్లువతో పొంగిన సిరులు
 
జగనన్న పాలవెల్లువతో ఆంధ్ర ప్రదేశ్ లోని పాడిరైతులపై  సిరులు పొంగాయంటూ సాక్షిలో నేడు ప్రధాన వార్త కనిపిస్తోంది. అమూల్ సంస్థ లో కలిసి జగన్ సర్కార్ పాడిరైతులకు మద్దతుగా పాలవెల్లువ కార్యక్రమాన్ని చేపట్టింది. పాల సేకరణ చేపట్టిన  అమూల్ 33 నెలల్లో ఏడుసార్లు పాడిరైతుల నుండి సేకరించే పాల ధరను పెంచింది... తద్వారా ఇతర ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ఇలా పాడిరైతులకు అదనంగా రూ.2,604 కోట్ల లాభం జరిగిందన్నది సాక్షి కథన.  

 

6. ఆంధ్ర ప్రదేశ్ లో నేడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు సాక్షి ప్రదాన వార్త ప్రచురించింది. 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల భర్తీకి నేడు నోటిఫికేషన్ వెలువడనుందని తెలిపారు. ఇవాళ్టినుండే అంటె నవంబర్ 20 నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని... డిసెంబర్ 11  వరకు గడువు  వుంటుందని తెలిపారు. డిసెంబర్ 31న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు... ఎంపికైన వారికి  వచ్చే ఏడాది ఆరంభంలో నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు సాక్షి తెలిపింది. 


7. కేసీఆర్ ముఖంలో ఓటమి కళ: రేవంత్ రెడ్డి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతవడం ఖాయమంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో కామెంట్స్ ను ఆంధ్రజ్యోతి ప్రధానవార్తగా ప్రచురించింది. తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ ను బట్టే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలావుంటాయో అర్థమవుతుందని అన్నారు.  80  నుండి 85 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం ఖాయమని రేవంత్ దీమా వ్యక్తం చేసారు. హంగ్ ప్రసక్తే వుండదని... ఇది బిజెపి, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారమని అన్నారు. మాదిగ సామాజివర్గం ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కు పడకూడదనే బిజెపి ఎస్సీ వర్గీకరణ నాటకం ఆడుతోందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ సాధ్యమన్నారు. ఇలా రేవంత్ ప్రెస్ మీట్ లోని ప్రధాన అంశాలను మొదటి పేజీలో ప్రచురిచింది ఆంధ్రజ్యోతి. 

85 సీట్లతో తెలంగాణలో అధికారం: రేవంత్ రెడ్డి ధీమా


8. కాళేశ్వరం దోషులు జైలుకే : జేపి నడ్డా 

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని... బిజెపి అధికారంలోకి రాగానే దోషులను గుర్తించి శిక్షిస్తామని బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా హెచ్చరించారు. తెలంగాణలోని నిరుపేదల సొత్తును కూడా సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని అన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతి, కుటుంబపాలనను అంతమొందించాలని... కమలం వికసించాలంటూ నడ్డా ప్రసంగాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 


9. కాంగ్రెస్ కట్టల పాములు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  కాంగ్రెస్ భారీ నగదును సమకూర్చుకుంటోదని... తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడుతోందని నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.  ఇటీవల పట్టుబడ్డ రూ.7.5 కోట్ల నగదు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డివేనని...ఈ వ్యవహారంపై పోలీసులు తీగలాగితే డొంక కదులుతోందని అన్నారు. శ్రీనిధి ఇంటర్నేషనల్ ఛైర్మన్ కేటీ మహి ఇంటినుండే ఈ డబ్బును తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. అలాగే తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి కంపనీ నుండి మ్యాన్ పవర్ కంపనీకి బదిలి అయిన రూ.8 కోట్లను ఈసి ప్రీజ్ చేసిందని నమస్తే తెలంగాణ పేర్కొంది. ఇలా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో డబ్బుల పంపీణికీ సిద్దమవుతున్నారంటూ నమస్తే పత్రిక  కథనం సారాంశం. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : హైదరాబాద్‌లో పట్టుబడ్డ రూ.7.4 కోట్లు.. దర్యాప్తు ముమ్మరం, 10 మందికి నోటీసులు


10. దేశంలోనే తెలంగాణ టాప్ 

తలసరి జిడిపి విషయంలో దేశంలో తెలంగాణ టాప్ లో వుందంటూ అంతర్జాతీయ పత్రిక పోర్బ్స్ లో ప్రచురించారని నమస్తే తెలంగాణ తెలిపింది.  తెలంగాణ తలసరి జిడిపి 3.08 గా లక్షలుగా వుందని... ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే చాలా ఎక్కువని పేర్కొంది. ఇలా భారత్ లోని  అన్నిరాష్ట్రాల జిడిపి ఎంత? తలసరి జిడిపి ఎంత? అనేదానిపై స్పష్టమైన లెక్కలతో పోర్బ్స్ ఓ జాబితాను విడుదల చేసిందని... ఇందులో పక్కా లెక్కలు వున్నాయన్నది నమస్తే తెలంగాణ కథనం.

Follow Us:
Download App:
  • android
  • ios