Asianet News TeluguAsianet News Telugu

టుడే టాప్ స్టోరీస్ : నేడే ప్రపంచ కప్ ఫైనల్. కామారెడ్డిలో ఓటుకు రూ.10 వేలన్న రేవంత్.. హైదరాబాద్ లో నోట్లకట్టలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎక్కువమంది చూసే  దిన పత్రికలు ఈ రోజు తమ మెయిన్ ఎడిషన్స్ ను ఎలాంటివార్తలతో పొందుపరిచాయో సమగ్ర కథనం. 

Today top stories in Andhra Pradesh and Telangana AKP
Author
First Published Nov 19, 2023, 7:52 AM IST

నేడే ప్రపంచకప్ ఫైనల్.. భారత్-ఆసిస్ ఢీ 

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 తుదిపోరు గురించి ఈనాడు మొదటి పేజీలో ఆసక్తికర కథనం ప్రచురించింది. యావత్ దేశ ప్రజల ప్రపంచకప్ ఆశను నెరవేరుస్తూ అద్భుత ఆటతీరుతో టీమిండియా ఫైనల్ కు చేరింది... మరో అడుగుదూరంలో నిలిచిందన్నారు. ఇరుజట్లు బలాలు, బలహీనతలు... గత రికార్డులను ప్రచురించారు. ఇక టిమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ,  ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్ కామెంట్స్ ను కూడా ప్రచురించారు.  

ICC World cup final: ఒక్క అడుగు! ఫైనల్‌లో తేడా కొట్టిందే... అంతా గోవిందా! ఇన్నాళ్లు పొగిడిన వాళ్లే...


బిజెపి మెనిఫెస్టో విడుదల 

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ప్రజలకు వివరించేందుకు రూపొందించిన మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదలచేసారు.  ఈ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ ఈనాడు కథనం రాసింది. బిసి ముఖ్యమంత్రి... ధరణి స్థానంలో మీభూమి తీసుకువస్తామన్న బిజెపి హామీని ప్రధానంగా పేర్కొంది.  ఇక వరికి రూ.3100 మద్దతుధర,  పంటలకు ఉచిత భీమా,కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి హామీలతో పాటు బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తామంటూ బిజెపి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ఈనాడు ప్రచురించింది. 

Telangana Assembly Election 2023 : ‘‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ ’’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో.. ముఖ్యాంశాలివే


కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ 

తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కథనాన్ని ఈనాడు ప్రధాన పేజిలో ప్రచురించింది.  చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలన్న ఆదేశాలను తాను వ్యతిరేకించినట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిందెవరో... రాష్ట్రాన్ని సాధించిందెవరో... స్వరాష్ట్రాన్ని ధనికరాష్ట్రంగా చేసిందెవరో... వ్యవసాయానికి సాగు నీళ్లు, కరెంట్ ఇచ్చిందెవరో మీరే తేల్చుకోవాలంటూ కేసీఆర్ సాగించిన ప్రసంగాన్ని ఈనాడు ప్రచురించింది.  

 

ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం

భూముల వివాదాల పరిష్కారానికి జగన్ సర్కార్ సరికొత్త విధానం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి సాక్షి ప్రధాన వార్తగా ప్రచురించింది. వ్యవసాయ, వ్యవసా వ్యవసాయేతర భూమి ఏదైనా దాని యజమాని ఎవరనేది ఒకే రిజిస్టర్ లో నమోదు చేసేలా ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకువచ్చారు. ఒక్కసారి భూయజమానికి టైటిల్ ఇస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించనుంది. భూవివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు... ఈ ట్రిబ్యునల్స్ ద్వారా న్యాయం జరగలేదని భావిస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లే అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇలా ల్యాండ్ టైట్లింగ్ చట్టంద్వారా విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 

 
జగన్ సర్కార్ పై రామోజీరావు విద్వేషం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ప్రముఖ మీడియాసంస్థ ఈనాడు విషం చిమ్ముతోందని సాక్షి మీడియా ఆరోపిస్తోంది. దీంతో ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సాధికారత యాత్రలకు ప్రజాధరణ కరువయ్యిందంటూ ఈనాడు తప్పుడు వార్తలు ప్రచురిస్తోందంటూ ఓ వార్తను సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించారు. సభ ప్రారంభానికి ముందో, తర్వాతో ఖాళీగా వున్న కుర్చీలను ఫోటోతీసి సభ వెలవెలబోతోందని ఈనాడు ప్రచురిస్తోందని అన్నారు. ఇకనైనా వైసిపి ప్రభుత్వంపై అసత్య కథనాలు రాయడం ఆపాలని రామోజీరావును సాక్షి కోరింది. 


నేను మళ్లీ గెలవగానే మహారాష్ట్రపై దృష్టి : కేసీఆర్ 

తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే మహారాష్ట్రపై ప్రత్యేక ద‌ృష్టి పెడతానంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు శీర్షికగా ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఉద్యమ సమయంలో చంద్రబాబుకు చెంచాగిరీ చేసి ఉద్యమకారులను రైఫిల్ తో బెదిరించారంటూ రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి అని సంబోధించారు కేసీఆర్. ఇక బిజెపి హిందుత్వానికి గౌరవం లేకుండా చేస్తోందన్నారు. ప్రధాని మోదీ ఇటీవల కేసీఆర్ తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరాడంటూ చేసిన కామెంట్స్ పై కేసీఆర్ స్పందించారు. ప్రధాని హోదాలో వున్నవ్యక్తి ప్రైవేట్ మాటలను ప్రజలకు చెబుతారా? అని కేసీఆర్ నిలదీసారు. ఇలా చేర్యాల సభలో కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 

తెలంగాణలో గెలిచి మహారాష్ట్రకు వస్తానని.. కాంగ్రెస్, బీజేపీ భయం అదే .. బీఆర్ఎస్‌ను ఓడించేందుకు కుట్ర: కేసీఆర్


ఓటుకు రూ.10 వేలు! 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇచ్చి అయినా సరే కామారెడ్డిలో గెలవాలని చూస్తున్నారంటే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రధాన శీర్షికగా ఆంధ్రజ్యోతి మరోవార్త ప్రచురించింది. కామారెడ్డిలో పోటీచేస్తున్న కేసీఆర్ ఓటర్లను కొనేందుకు రూ.200 కోట్లు ఖర్చుచేస్తున్నారని... గెలిచాక 2వేల కోట్ల విలువైన భూములను కాజేయడానికే ఇదంతా చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. తనను కుక్క అన్న కేటీఆరే వీధికుక్కు, పిచ్చికుక్క అని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అనే కుక్కను పొలిమేరవరకు తరిమికొడదాం అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 


రైతు బతుకు ఆగమే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే ఏమైతదో చూడండి... అంటూ నమస్తే తెలంగాణ కొన్ని లెక్కలను ప్రజలముందుంచే ప్రయత్నం చేసింది. అలాగే బిజెపి మేనిఫెస్టో గురించి కూడా ప్రస్తావిస్తూ... ఇప్పటికే రైతులను అన్యాయం చేసేలా మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్న బిజెపి సర్కార్ రైతుబంధును ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని... మేనిఫెస్టోతో ఇది అర్థమయ్యిందంటూ పేర్కొంది.  ఇలా కాంగ్రెస్, బిజెపి లను గెలిపిస్తే తెలంగాణ రైతు బతుకు ఆగం అవుతుందని నమస్తే తెలంగాణ పేర్కొంది. 


కాంగ్రెస్ కట్టల కుట్రలు! 

హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ లో పట్టుబడ్డ భారీ నగదుకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో ప్రచురించింది నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డబ్బే ఇది... అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఈ పత్రిక పేర్కొంది. ఆరుకార్లలో రూ. 7.4 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని... వీటిని ఖమ్మం తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఓటర్లను కొనేందుకే కాంగ్రెస్ డబ్బులు పంచేందుకు సిద్దమయ్యిందని... కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఈ డబ్బు తరలిస్తున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. 

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డబ్బు.. 6 కోట్లు పైనే, ఖమ్మం జిల్లా నేతదిగా అనుమానం..?


బిఆర్ఎస్ కార్యకర్తపై కత్తిపోట్లు... 

నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన హత్యాయత్నాన్ని నమస్తే తెలంగాణ మొదటిపేజీలో ప్రచురించింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గండివేట్ లో ముగ్గురు బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు కత్తితో దాడిచేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని నమస్తే తెలంగాణ పేర్కొంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios