శ్రీకాకుళం: పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడనే అనుమానంతో అన్నను హత్య చేశారు తమ్ముళ్లు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది.

శ్రీకాకుళం జిల్లాలోని పిండ్రువాడలో తిరుపతిరావు అనే వ్యక్తిని తమ్ముళ్లు కర్రలతో కొట్టి చంపారు. పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడనే నెపంతో  కరణం కాశీవిశ్వనాత్, కరణం సత్య లు కొట్టి చంపారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడనే ఉద్దేశ్యంతోనే తన భర్తను సోదరులు కొట్టి చంపారని తిరుపతిరావు భార్య ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిరావును హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని రోజులుగా తమకు వస్తున్న పెళ్లి సంబంధాలను  చెడగొడుతున్నారని తిరుపతిరావుపై కక్ష పెంచుకొని నిందితులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.