తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇంతకీ ఏంటా మార్పులు.? వీటివల్ల భక్తులపై పడే ప్రభావం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 

తిరులమ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శించుకుంటారు. ప్రపంచంలో రిచ్‌ టెంపుల్స్‌లో ఇదీ ఒకటి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారు. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా సౌకర్యాలు కూడా పెంచుతున్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇటీవల కొన్ని రూల్స్‌ను మార్చారు. 

ఇందులో భాగంగానే టీటీడీ రూమ్ పాలసీలో మార్పులు చేసింది. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇప్పుడు సామాన్యులకు రూమ్స్ సంఖ్య పెంచారు. కానీ రాజకీయ నాయకులు, మంత్రులు, పోలీసులు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల రికమెండేషన్‌ లెటర్స్‌తో వచ్చే భక్తులకు రూమ్ ఇచ్చే పద్ధతిలో మార్పులు చేశారు. ఇంతకుముందు తిరుపతి దర్శనం టికెట్ లేకపోయినా ఇలాంటి లెటర్ తెస్తే రూమ్ ఇచ్చేవాళ్లు. ఇకపై రూమ్ కావాలంటే తిరుపతి దర్శనం టికెట్ తప్పనిసరి. టికెట్ లేకపోతే రూమ్ ఇవ్వరు. లెటర్ ఉన్నా సరే రూమ్ ఇవ్వరు. ఆ రూమ్స్ సామాన్యుల కోసం కేటాయించారు. కాబట్టి తిరుపతి దర్శనం టికెట్ ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూమ్ తీసుకోవచ్చు అని తిరుపతి తిరుమల దేవస్థానం తెలిపింది.

తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతి రోజు 7,500 రూమ్స్ భక్తులకు ఇస్తుంది. అందులో 3500 రూమ్స్ సాధారణ భక్తులకు కేటాయించారు. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 1580 రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు, దాతల కోసం 400 రూమ్స్ కేటాయించారు. మిగిలిన రూమ్స్ VIP, VVIP లకు కేటాయించారు. 

తిరుపతి నో ఫ్లై జోన్ నినాదం:

తిరుమల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ చేయాలనే నినాదం గట్టిగా వినిపిస్తోంది. తిరుపతి దేవస్థానం బోర్డు (Tirupati Temple Administration) సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు దీని గురించి రిక్వెస్ట్ చేసింది. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో మాట్లాడారు. 

దేవస్థానం బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆదివారం సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌కు లెటర్ రాసింది. తిరుమలను 'నో-ఫ్లై జోన్' (No-Fly Zone) గా ప్రకటించాలని కోరింది. దేవాలయం పవిత్రతను, సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం అని బోర్డు తెలిపింది. 

మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై స్పందించారు. నేను నావిగేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడాను.ఏ ప్రాంతాన్ని అయినా నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి చట్టంలో వీలు లేదు. దీనికి వేరే ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతుకుతున్నారు అని చెప్పారు.