తిరుపతి మేయర్ గా మాజీ అటెండర్ కోడలు.. డిప్యూటీ మేయర్ గా ఒకప్పటి డ్రైవర్..

తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ గా డా. శిరీష రికార్డ్ సృష్టించారు. డిప్యూటీ మేయర్ గా ముద్ర నారాయణ ప్రమాణస్వీకారం చేశారు. కాగా మేయర్ డా. శిరీష మామగారు తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అటెండర్ గా చేసి రిటైర్ కావడం విశేషం. 

tirupati mayor doctor sirisha, deputy mayor mudra narayana - bsb

తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ గా డా. శిరీష రికార్డ్ సృష్టించారు. డిప్యూటీ మేయర్ గా ముద్ర నారాయణ ప్రమాణస్వీకారం చేశారు. కాగా మేయర్ డా. శిరీష మామగారు తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అటెండర్ గా చేసి రిటైర్ కావడం విశేషం. 

కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 11గంటలకు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 

జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన ఎన్నికల పరిశీలకులు నవీన్ కుమార్ సమక్షంలో తిరుపతి శాసనసభ్యులు, కార్పొరేషన్ ఎక్స్ అఫిషియోసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

వైసీపికి చెందిన 48మంది కార్పొరేటర్లు, టీడీపీకి చెందిన ఒక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్పొరేటర్లలో 27మంది మహిళలు, 22మంది పురుషులు ఉన్నారు. 

మొదట కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఆ తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. వైసీపీ తరఫున నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండటంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు వారికే దక్కాయి. 27 వ డివిజన్ కార్పొరేటర్ శిరీష పేరును మేయర్గా ఒకటవ డివిజన్ కార్పొరేటర్ రాధాకృష్ణారెడ్డి ప్రతిపాదించగా 16 వ డివిజన్ కార్పొరేటర్ మోహన్ కృష్ణ యాదవ్ బలపరిచారు. దీంతో శిరీష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 అలాగే నాలుగో డివిజన్ కార్పొరేటర్ భూమన అభినయ రెడ్డి పేరును డిప్యూటీ మేయర్గా 14 వ డివిజన్ కార్పొరేటర్ ముద్ర నారాయణ ప్రతిపాదించగా 38 వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రనాథ్ బలపరిచారు.

 ఆ తరువాత నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉండగా, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు వాయిదా వేశారు. 

కాగా తిరుపతి తొలి మేయర్ గా ఎన్నికైన డా. శిరీష మామఅయిన మునెయ్య తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఒకప్పుడు అటెండర్. 30 ఏళ్ల సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్ గా ఆరేళ్ళ క్రితం రిటైర్ అయ్యారు. ఆయన కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కు తొలి మేయర్గా ఎన్నికయ్యారు. అటెండర్ గా తాను పనిచేసిన సంస్థకు తన కోడలే మేయర్ గా అవ్వడంపట్ల ఆయనతో పాటు కుటుంబసభ్యలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మునయ్య కు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆసుపత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్ద కుమారుడు. ఆయన భార్యే డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసి యాదవ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు.  కడప జిల్లా కొర్రపాడు కు చెందిన శిరీష 1980 లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి 2011 లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. 

కొంతకాలం తిరుపతిలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో గైనకాలజిస్ట్ గా పనిచేశారు. పీడియాట్రీషియన్ మునిశేఖర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు వైష్ణవి కూడా చిన్న పిల్లల ఆసుపత్రి లో వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇక తిరుపతి డిప్యూటీ మేయర్ గా ముద్ర నారాయణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 1963లో జన్మించారు. ఏడవ తరగతి వరకు చదువుకున్న ఆయన 1980లో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994లో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా పనిచేశారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2002లో జరిగిన తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీలో చేరిన ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో 14 వ డివిజన్ కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios