ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన  శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పవన్ కల్యాణ్‌పై అంబటి  రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తానని.. అందుకు మ్రోతోపాటు మరికొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా కూడా అంబటి చెప్పారు. అయితే ఇందుకు కౌంటర్‌గా జనసైనికులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జనసేన నేతలు, కార్యకర్తలు.. SSS పేరుతో రాంబాబుపై సినిమా నిర్మించనున్నట్టుగా తెలిపారు.

ఇందుకు సంబంధించి ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ‘‘ప్రొడక్షన్ నెంబర్. 6093.. జగ్గుభాయ్ సమర్పించు.. SSS.. సందులో సంబరాల శ్యాంబాబు @ రాంబాబు’’ అని పోస్టర్‌ను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబందించి హీరోయిన్స్‌గా ఇద్దరిని ముంబయి రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొస్తామని తెలిపారు. రెడ్ లైట్ ఏరియా నుంచి రాకపోతే కలకత్తా.. చాందినీ గంజ్ నుంచి హీరోయిన్‌లను తీసుకొస్తామన్నారు.

Scroll to load tweet…

Also Read: టార్గెట్ పవన్.. ఢిల్లీ వెళ్లనున్న అంబటి.. ‘‘బ్రో’’ లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు!!

ఇదిలా ఉంటే.. మంత్రి అంబటి రాంబాబు తీయబోయే సినిమాకు కౌంటర్‌గా వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నామని జనసేన నేత పోతిన మహేష్ చెప్పారు. బుధవారంనాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తీయబోయే వెబ్ సీరిస్‌కు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, , గొడ్డలి, డాటర్ ఆఫ్ వివేకా, కోడికత్తి సమేత శీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అద్దె ఇల్లు, ఓ ఖైదీ వదిలిన బాణం వంటి పేర్లను పరిశీలిస్తున్నామన్నారు.