Asianet News TeluguAsianet News Telugu

వివాహితపై గ్యాంగ్‌రేప్: 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

ఓ వివాహితపై అత్యాచారానికి  పాల్పడిన  ఇద్దరు నిందితులకు 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ  తిరుపతి నాలుగవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.రాంగోపాల్ సోమవారం నాడు తీర్పిచ్చారు.

Tirupati court orders 20 years jail for two  accused


తిరుపతి: ఓ వివాహితపై అత్యాచారానికి  పాల్పడిన  ఇద్దరు నిందితులకు 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ  తిరుపతి నాలుగవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.రాంగోపాల్ సోమవారం నాడు తీర్పిచ్చారు.

కడప జిల్లా రాజంపేట మండలం మండపల్లికి చెందిన ఓ వివాహిత భర్తతో విడిపోయి తండ్రి వద్దే ఉంటుంది. చిత్తూరు జిల్లా రేణిగుంట కరకంబాడి తారకరామనగర్‌లో తండ్రి నివాసం ఉంటున్నారు.  తండ్రి  ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో  సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.  

అదే ఫ్యాక్టరీలో  ఆమె కూడ క్యాంటీన్‌లో పనికి కుదిరింది.  ఉదయం పూట 11 గంటలకు విధులకు వెళ్లి రాత్రి  తొమ్మిదిన్నర గంటలకు ఆమె  ఇంటికి వచ్చేది.  అయితే బాధితురాలు భర్తతో విడిపోయి ఉన్న విషయాన్ని గుర్తించిన ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారం చేయాలని ప్లాన్ చేశారు.

 2014 నవంబర్ 19వ తేదీన  ప్రేమ్ కుమార్, గుండ్రాళ్ల చలపతిలు పథకం ప్రకారం బాధిురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఫ్యాక్టరీ నుండి సోదరుడితో కలిసి ఇంటికి వస్తున్న బాధితురాలిని  ప్రేమ్‌కుమార్ తన మోటార్ బైక్‌‌పై తీసుకెళ్లాడు.  కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత బైక్ ను ఆపాడు.  తన బైక్‌లో పెట్రోల్  తక్కువగా ఉందని  నమ్మించి బాధితురాలిని దింపేసి ఆమె సోదరుడిని  ఇంటి వద్ద దింపేసి పెట్రోల్ పోసుకొని వస్తానని చెప్పాడు.

బాధితురాలి సోదరుడిని  ఇంటి వద్ద దింపేసి ప్రేమ్ కుమార్ ఆమె వద్దకు వచ్చాడు.  ఆమెను చలపతివద్ద ఇంటికి తీసుకెళ్లాడు.  చలపతి ఇంట్లో బాధితురాలిపై ఇద్దరూ నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

 బాధితురాలి తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.  నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసును సాక్ష్యాలతో నిరూపించారు . దీంతో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.రాంగోపాల్ సోమవారం నాడు తీర్పు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios