Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల వెళ్లి.. దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్థ్యం ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో1000 దైవ దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.  

APSRTC buses: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల వెళ్లి.. దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్థ్యం ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో1000 దైవ దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సులలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.

తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేస్తారని అధికారులు తెలిపారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చే ప్రయాణికులకు ఈ సేవ‌లు మ‌రింత సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణాన్ని క‌ల్పించ‌నున్నాయి. 

ఇదిలావుండ‌గా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్నారు. . దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగానే ఆర్జిత సేవలు నిర్వహిస్తామని అధికారులు వెల్ల‌డించారు. తిరుమ‌ల‌కు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో ఏప్రిల్‌ 1న శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించింది. అదేవిధంగా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్ల సంఖ్యను పెంచింది. ఈ క్ర‌మంలోనే భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. 

అలాగే, తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ హెచ్చ‌రించింది. భక్తులు అన్యమత ప్రచార సామగ్రిని, వ్యక్తుల ఫోటోలను తిరుమలకు తీసుకెళ్లడంపై టీటీడీ నిషేధం విధించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రిని తిరుమ‌లకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి టీటీడీ దీనికి సంబంధించిన తాజాగా హెచ్చ‌రించింది.