టీటీడీ కొత్త పాలకమండలి : 24 మందితో జాబితా రెడీ.. ఎమ్మెల్యేలు సామినేని , పొన్నాడ సతీష్‌లకు చోటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలిని నియమించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలిని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను , పొన్నాడ సతీష్ కుమార్, తిప్పేస్వామిలకు అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబితాలో తెలంగాణలోని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య సీతారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.
టీటీడీ పాలకమండలి ఫైనల్ జాబితాలో మాసీమా బాబు, యానాదాయ్య, నాగసత్యం, శిద్ధా సుధీర్‌లకు అవకాశం కల్పించారు. కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు, నాగ సత్యం యాదవ్, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్‌పాండేలకు అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి శరత్, మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్‌లకు చోటు కల్పించింది ఏపీ ప్రభుత్వం.
అలాగే మేకా శేషుబాబు, ఆర్ వెంకట సుబ్బారెడ్డి, సామల రామిరెడ్డి, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, విశ్వనాథ రెడ్డి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సుదర్శన్ వేణులకు అవకాశం కల్పించారు.