తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. ఇవాళ్టి నుండి మరో వెయ్యి టిక్కెట్లను పెంచింది. పెంచిన వెయ్యి టిక్కెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించనున్నారు. దీంతో ప్రతి రోజూ 13 వేల మందికి శ్రీవారి దర్శనం దక్కనుంది.

ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించారు.ఆఫ్ లైన్ లో ప్రతి రోజూ  3 వేల టిక్కెట్లను భక్తులకు అందిస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకొన్న నిర్ణయంతో ప్రతి రోజూ ఆన్ లైన్ లో 10వేల టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. 

also read:రేపటి నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం: టీటీడీ గ్రీన్ సిగ్నల్

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి తిరుపతిలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 8వ తేదీ నుండి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు.కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం కఠినంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా జిల్లా అధికారులు ప్రకటించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే మరింత మందికి స్వామిని దర్శించుకొనేందుకు అవకాశం లభించనుంది.