Asianet News TeluguAsianet News Telugu

solar eclipse 2022 : పన్నెండుగంటలపాటు మూసుకోనున్న తిరుమల శ్రీవారి ఆలయం.. వివరాలు ఇవే...

పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం మంగళవారం 12 గంటలపాటు మూసివేయనున్నారు. 

Tirumala temple to be shut for 12 hours due to solar eclipse on tuesday
Author
First Published Oct 24, 2022, 1:27 PM IST

తిరుపతి : సూర్య గ్రహణం సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 25) 12 గంటల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టిటీడీ తెలిపింది. 25న ఉదయం 8.11 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.  దర్శనాలకు సంబంధించి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోరు. అలాగే లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేయాలన్నారు. గ్రహణం పూర్తయ్యాక ఆలయ శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం తర్వాత కూడా కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి సహకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..
దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు,  తిరుమల జీయంగార్లు, టిటిడి అధికారుల సమక్షంలో ఈ ఆస్థాన వేడుకను నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించారు. బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి ఈ ఆస్థానం నిర్వహించారు. 

ఈ నెల 25న యాదాద్రి ఆలయం మూసివేత..

ఆ తర్వాత ఆలయంలో మూల విరాట్టుకు,  ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. ఇక ఆదివారం స్వామి వారిని 80,565 మంది భక్తులు దర్శించుకోగా.. 31,608మంది  భక్తులు తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.  తిరుమలలో భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.6.30 ఓట్లు వచ్చింది. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios