దీపావళి మరుసటిరోజు అంటే ఈ నెల 25న సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఈ మేరకు ఈవో ప్రకటించారు.
యాదగిరిగుట్ట : ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటలలోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8గంటలకు ఆలయాన్ని తెరిచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు.
తెలంగాణ పోలీస్ పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఇవే..
