తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి ఈ వీకెండ్‌లో భక్తులు పోటెత్తారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రోజున శ్రీవారిని 74,167 మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్థితులు కనిపించాయి. కోవిడ్‌ నిబంధనలన కారణంగా రెండేళ్లుగా తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు భక్తులకు ఎంట్రీ లేకుండానే, ఆలయ సిబ్బంది మధ్యే ఏకాంతంగా జరిగాయి. అయితే ఈ సారి భక్తుల మధ్య వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభంమైన శ్రీవారి తెప్పోత్సవాలు.. ఈ నెల 17వ తేదీ పౌర్ణమి వరకు కన్నుల జరగనున్నాయి. 

మొదటి రోజు ఆదివారం స్వామి పుష్కరిణిలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామ అవతారంలో స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులను అభయప్రదానం చేశారు. భక్తుల గోవింద నామాస్మరణ మధ్య సీతారామ లక్ష్మణ సమేతుడిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవతామూర్తుల దివ్య శోభను చూసి భక్తులు పరవశించిపోయారు. నేడు స్వామి వారు కృష్ణుని అవతారంలో తెప్పలపై వివాహరించనున్నారు. 

వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి శని, ఆది వారాల్లో భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీవారి దర్శనం టోకెన్ల సంఖ్య పెంచడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం రోజున శ్రీవారిని 74,167 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,976 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.5 కోట్లు వచ్చింది. 

తిరుమలకు భారీగా భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే సమస్య తలెత్తుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. అదనపు సిబ్బంది తనిఖీలు నిర్వహించినప్పటికీ.. వాహనాలు అలిపిరి వద్ద గంటకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇక, ఫిబ్రరిలో తిరుమల శ్రీవారిని 10,95, 724 భక్తులు దర్శనం చేసుకన్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 79.34 కోట్లు వచ్చింది. మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని టీటీడీ అధికారులు కోరారు. మరోవైపు తిరుమలలో కోవిడ్‌ కారణంగా మూసివేసిన టీటీడీ ఉచిత అన్నప్రసాద కేంద్రాలు తిరిగి ఆదివారం నుంచి ప్రారంభమయ్యా యి. కాగా, క్యూలైన్లలో కూడా త్వరలోనే అన్నప్రసాదం అందించనున్నట్లు సమాచారం.