ఏపీ అసెంబ్లీలో విజిల్స్ ఊదుతూ నిరసన: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుండి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
అమరావతి:ఏపీ అసెంబ్లీ సమావేశం నుండి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు నిలబడి నిరసనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ అసెంబ్లీ రెండు సార్లు వాయిదా పడింది. టీడీపీ సభ్యులు తమ డిమాండ్ పై నిరసనకు దిగారు. మరోవైపు టీడీపీ సభ్యులు ఏపీ అసెంబ్లీలో విజిల్స్ ఊదుతూ నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై ఏపీ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ముగ్గురు టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు,వెలగపూడి రామకృష్ణబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను ఇవాళ ఒక్క రోజు సభ నుండి సస్పెండ్ చేశారు. సభ నుండి కూడ సస్పెండ్ చేసినా కూడ సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు సభలోనే నిలబడి నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.
also read:ఏపీ అసెంబ్లీ సమావేశాలు: బహిష్కరణకు టీడీపీ నిర్ణయం
ఇవాళ ఉదయం నుండి ఏపీ అసెంబ్లీలో వీడియో చిత్రీకరించారని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు,బెందాళం ఆశోక్ లను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నిన్న ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.