ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో (Visakhapatnam) కొత్త సంవత్సరం తొలి రోజే ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విశాఖ ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్‌లో (BRTS Road) పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో (Visakhapatnam) కొత్త సంవత్సరం తొలి రోజే ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. విశాఖ ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్‌లో (BRTS Road) పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పర్యాటక కేంద్రమైన విశాఖలో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు ఆ రహదారిని మూసివేశారు. అయితే ఉదయం ఆ రహదారిపై వాహనాలను అనుమతించిన కాసేటికే ఈ ప్రమాదం జరిగింది.