తూర్పు గోదావరి యర్నగూడం వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం  యర్నగూడెం వద్ద  ఇవాళ  రోడ్డు ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.
 

Three killed  in  road accident  in  East godavari district lns

రాజమండ్రి:    తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి  మండలం యర్నగూడం వద్ద   మంగళవారంనాడు  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. కారు, మెడికల్ వ్యాన్,  కంటైనర్  ఢీకొనడంతో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  సంఘటనస్థలంలోనే  ఇద్దరు మరణించారు.  ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో  మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరిని  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కొవ్వూరు నుండి ఏలూరు వైపు వెళ్తున్న కారు  అతి వేగంగా  నడపడం వల్ల  ప్రమాదానికి కారణమైందని పోలీసులు  చెబుతున్నారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి  పక్క రోడ్డులో వెళ్తున్న  మెడికల్ వ్యాన్, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం పై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా  ప్రతి రోజూ  పలు ప్రాంతాల్లో  రోడ్డు ప్రమాదాలు  జరుగుతున్నాయి.  అతి వేగంతో  పాటు  డ్రైవర్ల తప్పిదాల  కారణంగా  రోడ్డు ప్రమాదాలు  చోటుచేసుకుంటున్నాయి.  రోడ్డు ప్రమాదాల నివారణకు  ప్రభుత్వాలు  చర్యలు తీసుకుంటున్నా  కూడా  ఫలితం ఇవ్వడం లేదు.

ఇవాళ  ఉదయం  ప్రకాశం జిల్లాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో  టీడీపీకి  చెందిన మాజీ ఎమ్మెల్యే  నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో  నిన్న జరిగిన  రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.  డీసీఎం, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం  జరిగింది. 

కడప జిల్లా కొండాపురం  మండలం చిత్రావతి వంతెన సమీపంలో  ఈ నెల  15న  జరిగిన  రోడ్డుప్రమాదంలో  11 మంది మృతి చెందారు.  తుఫాన్ వాహనం, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాడిపత్రికి  చెందినవారిగా  గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ ‌లోని కాంగ్రా జిల్లాలో   ఈ నెల  14న  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios